ఢిల్లీకి గుడ్‌న్యూస్.. బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

ఆక్సిజన్ కొరతతో సర్ గంగారాం ఆస్పత్రిలో 25 మంది చనిపోయారు. మరుసటి రోజే జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో మరో 25 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రతకు అద్దం పట్టే ఘటనలివి.

కరోనా సునామీతో దేశ రాజధాని ఢిల్లీ విలవిలలాడుతోంది. ఆసుపత్రులకు క్యూ కడుతున్న కరోనా రోగులు.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలతో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆక్సిజన్ కోసం లేఖలు కూడా రాశారు. ఢిల్లీలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.

ఢిల్లీకి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నట్లు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిందాల్ స్టీల్ ప్లాంట్ నుంచి 70 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌తో ఆదివారం రాత్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బయలుదేరింది. సోమవారం రాత్రికి రైలు ఢిల్లీకి చేరుతుందని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. అంగుల్, రూర్కెలా, రాయ్‌గఢ్, కళింగ్‌నగర్ ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ ఢిల్లీకి తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలో రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

Also Read: రెమిడెసివిర్ వాళ్లకి మాత్రమే.! ఇవి తెలుసుకోండి.. ఎయిమ్స్ డైరెక్టర్ కీలక సూచనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పీఎం కిసాన్ రూ.2 వేలు పొందే రైతులకు శుభవార్త.. ప్రతి సంవత్సరం రూ.36 వేలు!

Sun Apr 25 , 2021
రైతులకు అలర్ట్. మీకు పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు వస్తున్నాయా? అయితే మీరు ఏడాదికి రూ.36 వేలు పొందే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది. దీని కోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ పథకంలో చేరాలి.