ఒప్పో రెనో 6జెడ్ స్పెసిఫికేషన్లు లీక్.. మిడ్‌రేంజ్‌లో సూపర్ ఫీచర్లతో?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన రెనో 6జెడ్ స్మార్ట్ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం.

ప్రధానాంశాలు:మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను అందించే అవకాశంసెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశంఒప్పో రెనో 6జెడ్ స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఒప్పో రెనో 6 సిరీస్‌లో రెనో 6, రెనో 6 ప్రో, రెనో 6 ప్రో ప్లస్ ఫోన్లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ గురించి అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఒప్పో రెనో 6లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను అందించారు.
రూ.12 వేలలోపే శాంసంగ్ ట్యాబ్లెట్.. కేక పెట్టించే ఫీచర్లు.. మరో ట్యాబ్ కూడా!
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ కూడా ఈ ఫోన్ గురించి ట్వీట్ చేశారు. ఒప్పో రెనో 6జెడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌తో లాంచ్ కానుందని ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఒప్పో రెనో 6లో 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ రెండు విషయాల్లో కూడా ఒప్పో రెనో 6 కంటే తక్కువస్థాయి ఫీచర్లతోనే రెనో 6జెడ్ రానుంది. దీన్ని బట్టి ఈ ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలోనే లాంచ్ కానుందని అనుకోవచ్చు.

ఒప్పో రెనో 5జెడ్‌లో కూడా మీడియటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను అందించారు. రెనో 6జెడ్‌లో కూడా 5జీ సపోర్ట్ ఉండనుంది. ప్రాసెసర్, రిఫ్రెష్ రేట్, ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం తప్ప మిగతా ఫీచర్లేవీ ఈ టిప్‌స్టర్ షేర్ చేయలేదు. ఒప్పో రెనో 6జెడ్ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెనో 6 సిరీస్ గత నెలలో లాంచ్ అయ్యాయి.

ఒప్పో రెనో 6 ఫోన్లు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫోన్లు మనదేశంలో జులైలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. ఒప్పో రెనో 6 ప్రో ఈ మధ్యే యూఎస్ ఎఫ్‌సీసీ వెబ్ సైట్లో కూడా కనిపించింది. గ్లోబల్ లాంచ్ కూడా త్వరలో జరగనుందని దీన్ని బట్టి చెప్పవచ్చు. ఒప్పో రెనో 6 ప్రో ప్లస్‌ను గ్లోబల్ మార్కెట్లో ఒప్పో రెనో 6 ప్రోగా లాంచ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో కనిపించిన పోకో ఎఫ్3 జీటీ.. లాంచ్ అయితే బెస్ట్ అయ్యే అవకాశం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

భోజనంతో పచ్చి ఉల్లిపాయ.. అబ్బో, ఎన్ని ప్రయోజనాలో చూడండి

Fri Jun 18 , 2021
మీకు పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉందా? అయితే, ఈ ప్రయోజనాలు మీకు లభిస్తున్నట్లే. అవేంటో చూసేయండి మరి.