ఈ బడ్జెట్ ఒప్పో ఫోన్ ధర పెరిగింది.. అయినా రూ.15 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన ఒప్పో ఏ54 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో పెంచింది. వేరియంట్‌ను బట్టి రూ.500 నుంచి రూ.1,000 వరకు ఈ ధర పెరిగింది.

ప్రధానాంశాలు:ఒప్పో ఏ54 ధర పెంపురూ.1,000 వరకు పెంచిన కంపెనీఒప్పో తన ఏ54 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో పెంచింది. వేరియంట్‌ను బట్టి రూ.1,000 వరకు ఈ ఫోన్ ధరను పెంచారు. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి.

ఒప్పో ఏ54 ధర, ఆఫర్లు
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,490 నుంచి రూ.13,990కు పెరిగింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,490 నుంచి రూ.15,490కి, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990 నుంచి రూ.16,490కు పెరిగింది. క్రిస్టల్ బ్లాక్, మూన్ లైట్ గోల్డ్, స్టారీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. నోకాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లు కూడా ఈ ఫోన్‌పై అందించారు. ఈ ఫోన్ పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఒక్కరోజు మాత్రం తక్కువ ధరల్లోనే ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 2 ధర లీక్.. మొదటిసారి ఆ ధరతో నార్డ్ సిరీస్ ఫోన్!
ఒప్పో ఏ54 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89.2 శాతంగానూ, రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ గానూ ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా, 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రోషూటర్ కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో ఏ54 పని చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 192 గ్రాములుగానూ ఉంది.
వివో ఎస్10 సిరీస్ ఫీచర్లు లీక్.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో!
Oppo A54 5G స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek Helio P35డిస్_ప్లే6.51 inches (16.54 cm)స్టోరేజ్_ఫైల్64 GBకెమెరాా13 MP + 2 MP + 2 MPబ్యాటరీ5000 mAhprice_in_india13490ర్యామ్4 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పిట్టకథలు మానేస్తే బెటర్.! జగన్ క్యాబినెట్‌లో కీలక మంత్రికి చురకలు

Wed Jul 14 , 2021
ఏపీ ఆర్థిక శాఖలో వేల కోట్ల అవకతవకలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణలు హీట్ రాజేస్తున్నాయి. అప్పులన్నీ అసంక్షేమానికి వినియోగిస్తున్నామని చెప్పడం పచ్చి అబద్ధమని టీడీపీ నేత ఖండించారు.