రూ.15 వేలలోపే ఒప్పో 5జీ ఫోన్.. లాంచ్ అయిపోయింది.. ఫీచర్లు ఇవే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ53ఎస్ 5జీ. దీని ధర రూ.14,990గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉన్నాయి.

ప్రధానాంశాలు:మే 2వ తేదీ నుంచి సేల్ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చుఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది డిసెంబర్‌లో మనదేశంలో లాంచ్ అయిన ఒప్పో ఏ53 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఒప్పో ఏ53ఎస్ 5జీలో నాచ్ ఉన్న డిస్ ప్లే అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఒప్పో ఏ53ఎస్ 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,990గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990గా ఉంది. క్రిస్టల్ బ్లూ, ఇంక్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ మే 2వ తేదీ ఫ్లిప్ కార్ట్‌లో నుంచి ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 డిస్కౌంట్ లభించనుంది.
200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూపొందిస్తున్న ఎంఐ.. మరో పెద్ద కంపెనీ కూడా అలా!
ఒప్పో ఏ53ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.52 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 13 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను ఇందులో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 189.6 గ్రాములుగా ఉంది.
Mi QLED TV 75: షియోమీ భారీ టీవీ.. మొదటిసేల్ ఈరోజే.. థియేటర్ తరహా అనుభవం ఇంట్లోనే!
OPPO A53s స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek Dimensity 700డిస్_ప్లే6.52 inches (16.56 cm)స్టోరేజ్_ఫైల్128 GBకెమెరాా13 MP + 2 MP + 2 MPబ్యాటరీ5000 mAhprice_in_india11990ర్యామ్6 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సీఎం జగన్‌ ఫోన్ కాల్!

Tue Apr 27 , 2021
ఏబీఎన్- ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు.