వెంకీ-మణిశర్మ కాంబినేషన్ అదుర్స్.. ప్రేక్షకలను ఫిదా చేస్తున్న ‘ఓ.. నారప్ప’

కొందరు హీరోలు.. మ్యూజిక్ డైరెక్టర్ల కాంబినేషన్ ఎప్పుటికీ ఎవర్‌గ్రీన్‌గానే ఉంటుంది. అందులో ఒక కాంబినేషనే వెంకటేష్, మణిశర్మలది. వీళ్లద్దరు కలిసి చేసిన పాటల్లో దాదాపు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ‘నారప్ప’ సినిమా నుంచి ‘ఓ.. నారప్ప’ అనే పాట కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.

తమిళ యువ హీరో ధనుష్ పాత్రలో.. బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన చిత్రం ‘అసురన్’. అటు ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు.. భారీ యాక్షన్‌తో కూడా ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పలు జాతీయా పురస్కారాలు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాని దగ్గుబాటి వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రియమణి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా చాలాకాలంగా విడుదలకు రెడీగా ఉంది.

కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. అయితే సెకండ్ వేవ్ తర్వాత లాక్‌డౌన్ పూర్తిగా ముగిసిపోయినా.. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఒకవేళ తెరిచిన థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు జనం సిద్ధంగా లేరు. దీంతో చేసేదేమీ లేక సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. తాజాగా నారప్ప సినిమా కూడా ఇదే దారిని ఎంచుకుంది. ఈనెల 20న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓ.. నారప్ప’ అనే పాటను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. వెంకీ, మణిశర్మ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన పాటలు అన్ని మంచి సక్సెస్ సాధించాయి. ఈ పాట కూడా అదే కోవలోకి వెళ్లింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేష్, అమ్ము అభిరామి మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ‘ఓ నారప్ప.. నువ్వంటే ఏటంగుందోయ్ నారప్ప’ అంటూ సాగే ఈ పాటని ధనుంజయ్, వారామ్ గాత్రం చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Anchor Suma: నా స్థలం కాజేశారు.. రాజీవ్ కనకాల, సుమలకు ఇదే నా శాపం: నటి అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్

Fri Jul 16 , 2021
దేవదాసు కనకాల... సుమకనకాల మామయ్య, రాజీవ్ కనకాల తండ్రి అయిన ఈయనకు ఇండస్ట్రీలో మంచి పేరు. ఎంతో మంది నటీనటులకు నటనలో ఓనమాలు నేర్పించి ఆర్టిస్ట్‌లుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. అలాంటి వ్యక్తిపై షాకింగ్ కామెంట్స్ చేశారు అన్నపూర్ణమ్మ.