వన్‌ప్లస్ నార్డ్ 2 ధర లీక్.. మొదటిసారి ఆ ధరతో నార్డ్ సిరీస్ ఫోన్!

వన్‌ప్లస్ తన కొత్త బడ్జెట్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 2ను ఈ నెల 22వ తేదీన లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీని ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ప్రధానాంశాలు:ధర రూ.31,999 నుంచి ప్రారంభం అయ్యే అవకాశంఅదరగొట్టే ఫీచర్లతో వచ్చేస్తుందివన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 22వ తేదీన లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. కంపెనీ దీనికి సంబందించిన పలు స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. దీన్ని బట్టి ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్744 సెన్సార్, 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, వంటి ఫీచర్లు ఉండనున్నాయని తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీని ధర, మరిన్ని కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్, 91మొబైల్స్ భాగస్వామ్యంతో ఈ ధరను లీక్ చేశారు. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గానూ ఉండనున్నట్లు సమాచారం. ఇది గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ ధర కంటే ఎక్కువ. వన్‌ప్లస్ నార్డ్ ధర రూ.30 వేలను దాటడం కూడా ఇదే మొదటిసారి.
వివో ఎస్10 సిరీస్ ఫీచర్లు లీక్.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో!
వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. యూఎఫ్ఎస్ 3.1 ఫాస్ట్ స్టోరేజ్, ఏఐ ఫొటోగ్రఫీ, ఏఐ డిస్‌ప్లే, ఏఐ గేమింగ్ మోడ్స్ కూడా ఇందులో అందించనున్నారు.

ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 30W లేదా 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

వన్‌ప్లస్ నార్డ్ 2లో వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోసెన్సార్‌లు ఇందులో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్616 కెమెరా ఉండనుంది.

డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ 5జీ, హాప్టిక్స్ 2.0, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించనున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2తోపాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో కూడా అదేరోజు లాంచ్ కానున్నాయి. అయితే ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో గురించి కంపెనీ ఎటువంటి సమాచారం అందించలేదు. గతేడాది లాంచ్ అయిన వన్‌ప్లస్ బడ్స్‌కు ప్రో వెర్షన్‌గా ఇవి లాంచ్ కానున్నాయి.

వన్‌ప్లస్ బడ్స్ ప్రోలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ఏఎన్‌సీ) ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ధర వన్‌ప్లస్ బడ్స్ కంటే ఎక్కువగా ఉండనుంది. అయితే దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు ఇంకా తెలియరాలేదు.
రూ.599 విలువైన ఇయర్‌ఫోన్స్ రూ.99కే.. ఎంఐ సూపర్ ఆఫర్!
OnePlus Nord 2 స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్MediaTek Dimensity 1200డిస్_ప్లే6.44 inches (16.36 cm)స్టోరేజ్_ఫైల్128 GBకెమెరాా64 MP + 8 MP + 5 MP + 2 MPబ్యాటరీ4115 mAhprice_in_india29999ర్యామ్8 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిఇతర వేరియంట్లు OnePlus Nord 2 OnePlus Nord 256GB 12GB RAMOnePlus Nord 2 256GB 8GB RAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

HIGHWAYపై దూసుకెళ్లనున్న హీరో.. స్పీడు మీదున్న ఆనంద్ దేవరకొండ

Wed Jul 14 , 2021
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం జోరు మీదున్నారు. దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మిడిల్ క్లాస్ మెలోడిస్‌తో హిట్ కొట్టేశారు. ఇప్పుడు ఈ హీరో వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేస్తున్నారు.