స్మార్ట్‌టీవీల ధరలు భారీగా పెంపు.. ఏకంగా 15 శాతం పైగా పెంచిన ప్రముఖ బ్రాండ్!

వన్‌ప్లస్ మనదేశంలో స్మార్ట్‌టీవీల ధరను పెంచింది. ఏకంగా 17.5 శాతం వరకు ఈ టీవీల ధరను కంపెనీ పెంచింది. నగదు రూపంలో చెప్పాలంటే గరిష్టంగా రూ.7,000 వరకు టీవీల ధరను పెంచారు.

ప్రధానాంశాలు:వన్‌ప్లస్ టీవీల ధరలు భారీగా పెంపుఏకంగా రూ.7 వేల వరకు..వన్‌ప్లస్ తన టీవీల ధరను మనదేశంలో పెంచింది. ఈ మధ్యే లాంచ్ అయిన వన్‌ప్లస్ యూ1ఎస్ టీవీల ధరలు కూడా పెరగడం విశేషం. కొన్ని టీవీల ధరలు కొంచెమే పెరగగా.. కొన్ని టీవీల ధరలు మాత్రం ఏకంగా 17.5 శాతం పెరగడం విశేషం. ధర ఎందుకు పెరిగిందో కారణం తెలియలేదు. అయితే ఓఫెన్ సెల్ ప్యానెల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరగడమే దీనికి కారణం అని తెలుస్తోంది. దీంతో చాలా కంపెనీలు ఇప్పటికే తమ టీవీల ధరలను మనదేశంలో పెంచాయి. ఇప్పుడు వన్‌ప్లస్ కూడా ఆ జాబితాలో చేరింది.

వన్‌ప్లస్ గతేడాది జులైలో మనదేశంలో వై-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు ఉన్నాయి. ఇటీవలే ఇందులో 40 అంగుళాల వేరియంట్ కూడా లాంచ్ అయింది. ఈ సంవత్సరం మేలో ఈ వేరియంట్‌ను వన్‌ప్లస్ లాంచ్ చేసింది.
50 మెగాపిక్సెల్ కెమెరాతో రానున్న రెడ్‌మీ 10.. ఇతర ఫీచర్లు కూడా లీక్!
వన్‌ప్లస్ వై-సిరీస్ టీవీల్లో 32 అంగుళాల వేరియంట్ ధర రూ.12,999 నుంచి ఏకంగా రూ.18,999కు పెరిగింది. ఇందులో 43 అంగుళాల వేరియంట్ ధరను రూ.22,999 నుంచి రూ.29,499కు పెంచారు. అలాగే 40 అంగుళాల వేరియంట్ ధర కూడా రూ.23,999 నుంచి రూ.26,499కు పెరిగింది.

వన్‌ప్లస్ టీవీ యూ1ఎస్ సిరీస్ ధరలు కూడా పెరిగాయి. ఇందులో 50 అంగుళాల వేరియంట్ ధర రూ.39,999 నుంచి రూ.46,999కు పెరిగింది. 55 అంగుళాల వేరియంట్ ధరను రూ.47,999 నుంచి రూ.52,999కు, 65 అంగుళాల వేరియంట్ ధరను రూ.62,999 నుంచి రూ.68,999కు పెంచారు. ఇందులో 50 అంగుళాల వేరియంట్ ధర ఏకంగా రూ.7,000 పెరగగా, 55 అంగుళాల వేరియంట్ ధర రూ.5,000, 65 అంగుళాల వేరియంట్ ధర రూ.6,000 పెరిగాయి.

అయితే మనదేశంలో టీవీల ధరను కేవలం వన్‌ప్లస్ మాత్రమే పెంచలేదు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే పరికరాల ధరలు పెరగడంతో వీటి ధరను పెంచుతున్నట్లు షియోమీ కూడా జూన్ నెలాఖరులో ప్రకటించింది. జులై 1వ తేదీ నుంచి షియోమీ, రెడ్‌మీ టీవీల ధరలు పెరిగాయి.
రూ.18 వేలలోపే ల్యాప్‌టాప్.. లాంచ్ చేసిన అసుస్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా లాంచ్.. ఈసారి వపర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..

Fri Jul 16 , 2021
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆది. విభిన్నమైన సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు అతను.. తాజాగా అతను నటిస్తున్న కొత్త సినిమా లాంచ్ అయింది.