బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. ఆయనతో జోడీ కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన బెల్లంకొండ శ్రీనివాస్.. త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఛత్రపతి సినిమా రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఆయనకు లేటెస్ట్‌గా హీరోయిన్‌గా బాలీవుడ్ భామ సెట్ అయిందట.

‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ కుమారుడు బెల్లంకొడ శ్రీనివాస్. తొలి సినిమా కాస్త ఫర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ అతనికి మంచి సక్సెస్‌ని అందించలేకపోయాయి. కెరీర్ ఆరంభం నుంచి స్టార్ దర్శకులు, టాప్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ వచ్చాడు శ్రీనివాస్. సమంత, కాజల్, తమన్నా, మెహ్రీన్, పూజా హెగ్డే ఇలా ఏ హీరోయిన్‌తో సినిమాలు చేసిన ఫలితం మాత్రం అదే రిపీట్ అయింది. ఇక ఆయన సినిమాకు దర్శకత్వం వహించిన వాళ్లు కూడా అంతా టాప్ డైరెక్టర్లే అయినా కూడా ఇప్పటికీ సరైన హిట్ పడలేదు.

దీంతో టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి బాలీవుడ్‌పై దృష్టిపెట్టాడు.. ఈ బెల్లంకొండ హీరో. 2005లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను ఆయన హిందీలో రీమేక్ చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను హిందీలో వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభం అయింది. రాజమౌళి స్వయంగా వచ్చి.. క్లాప్ కొట్టి మొదటి సీన్‌కు దర్శకత్వం వహించారు. అయితే అప్పట్లో హైదరాబాద్‌లో భారీగా వర్షాలు కురవడంతో సినిమా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది.

అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంపై మొదటి నుంచి సందగ్ధత నెలకొంటునే ఉంది. సినిమా అనుకున్నప్పటి నుంచి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న.. ఆలియా భట్, కియారా అడ్వాణీ, దిశా పటాని, శ్రద్ధా కపూర్‌లను ఈ సినిమా కోసం అడిగారని. కానీ, వీరెవరూ కూడా ఈ సినిమాలో చేసేందుకు ఓకే చేయలేదు అని వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో నటించేందుకు హీరోయిన్ రెజీనా కస్సాండ్రా ఓకే అన్నారు అని ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఫైనల్‌గా హీరోయిన్ ఈవిడే అంటూ మరో న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ సుస్రత్ బరుచాను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేశారనే మాట బలంగా వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటూ సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Virat Kohli అనూహ్య నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్ బై

Thu Sep 16 , 2021
భారత టీ20 జట్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. 2017లో ధోనీ నుంచి పూర్తి స్థాయిలో పగ్గాలు అందుకున్న కోహ్లీ.. వర్క్‌లోడ్ తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇకపై వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్‌గా మాత్రమే కోహ్లీ కొనసాగనున్నాడు.