నథింగ్ ఇయర్ 1 ధర ఇదే.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు!

వన్‌ప్లస్ సహవ్యవస్థాపకుడు కార్ల్‌పెయ్ నథింగ్ అనే కొత్త సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ పేరుతో మొట్టమొదటిసారి ఇయర్‌బడ్స్ లాంచ్ కానున్నాయి. నథింగ్ ఇయర్ 1 అనే పేరుతో రానున్న వీటి ధరను అధికారికంగా ప్రకటించారు.

ప్రధానాంశాలు:ధర రూ.5,999గా నిర్ణయించిన కంపెనీజులై 27వ తేదీన లాంచ్నథింగ్ ఇయర్ 1 ధరను మనదేశంలో అధికారికంగా ప్రకటించారు. వన్‌ప్లస్ సహవ్యవస్థాపకులు కార్ల్ పెయ్ బయటకు వచ్చిన నథింగ్ అనే బ్రాండ్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే లాంచ్‌కు రెండు వారాల ముందే దీని ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా ఏ కంపెనీ అయిన ఈ విషయంలో కాస్త గోప్యత వహిస్తాయి. కానీ నథింగ్ ముందే ప్రకటించడం కాస్త ఆశ్చర్యకరమే. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉండటం విశేషం.

నథింగ్ ఇయర్ 1 ధర
వీటి ధరను మనదేశంలో రూ.5,999గా నిర్ణయించారు. ధర విషయంలో నథింగ్ ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుందో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఎందుకంటే దీని గ్లోబల్ ధరను 99 పౌండ్లుగా(సుమారు రూ.10,200) నిర్ణయించారు. దాని కంటే మనదేశ ధర చాలా తక్కువగా ఉండటం విశేషం. మనదేశంలో ట్రూవైర్‌లెస్ విభాగంలో ఎంతో పోటీ నెలకొంది. కాబట్టి తక్కువ ధరతో తీసుకురావడం నిజంగా బ్రాండ్‌కు ఉపయోగపడే అంశం.
నోకియా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది.. స్పెసిఫికేషన్లు లీక్.. లాంచ్ త్వరలోనే!
ఈ ధరలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన ఫీచర్‌ను కూడా ఇందులో అందిస్తూ ఉండటం విశేషం. ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్, సోనీ, శాంసంగ్ వంటి బ్రాండ్లతో ఇవి పోటీ పడనున్నాయి. ఇందులో ఉండే ఫీచర్లు నథింగ్‌ను కచ్చితంగా ఒక మెట్టుపైనే నిలబెడతాయి. దీంతోపాటు అందించబోయే ట్రాన్స్‌పరెంట్ కేస్ వీటికి మరో పెద్ద ప్లస్ పాయింట్.

నథింగ్ ఇయర్ 1 గురించి ప్రస్తుతం ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. పారదర్శకమైన డిజైన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు నథింగ్ స్వీడిషన్ ఇండస్ట్రియల్ సంస్థ టీనేజ్ ఇంజినీరింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో శాంసంగ్‌లో పనిచేసిన మను శర్మను కూడా నథింగ్ నియమించుకుంది.

దీనికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ మనదేశంలో జులై 27వ తేదీన జరగనుంది. అంతేతప్ప దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఏవీ బయటకు రాలేదు. కేవలం ట్రూవైర్‌లెస్ ఇయర్‌ఫోన్సే కాకుండా.. నథింగ్ నుంచి ఇంకా ఎన్నో ఉత్పత్తులు బయటకు రానున్నాయి. స్మార్ట్ ఫోన్ కంపెనీ ఎసెన్షియల్‌ను కూడా నథింగ్ ఇటీవలే కొనుగోలు చేసింది.
బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు లాంచ్ చేయనున్న అసుస్.. ఈ వారంలోనే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు భారీ షాక్.. ఆ జీవో సస్పెండ్!

Mon Jul 12 , 2021
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. జీవో నంబర్ 2ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.