తెలంగాణలో అన్ లాక్.. ఏపీకి మాత్రం నో పర్మిషన్

తెలంగాణలో అన్ లాక్ ప్రక్రియ ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే పలు రాష్ట్రాలకు వెళ్లే బస్సులు మాత్రం ఇంకా నడవడం లేదు. ఆయా రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉండటంతో… అంతర్ రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి.

తెలంగాణలో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దంతో ఇవాల్టి నుంచి పూర్తిగా అన్ లాక్ కానుంది. రాష్ట్రంలోని అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలు తెరుచుకోనున్నాయి. ప్రజా రవాణ సైతం పరుగులు పెట్టనుంది. లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఆదివారం నుంచి సినిమా హాళ్లు, పబ్‌లు, షాపింగ్ మాల్స్‌, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరచుకోనున్నాయి. యథావిధిగా మెట్రో, బస్సు సర్వీస్‌లు నడవనున్నాయి.

మే 12 నుంచి జూన్‌ 19 వరకు అంటే.. 38 రోజులపాటు తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో.. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. అయితే అన్ని తెరుచుకున్నా రాష్ట్రంలో అంతర్ రాష్ట్ర సర్వీసులు మాత్రం ఆగిపోనున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఆర్టీసీ 9 వేల బస్సులను నడిపింది. వీటిల్లో వెయ్యి బస్సులను అంతర్ రాష్ట్ర సర్వీసులకు కేటాయించింది.

అయితే నేటి నుంచి 8 వేల బస్సులు యథావిధిగా రోడ్డెక్కినా.. అంతర్ రాష్ట్ర సర్వీసులు మాత్రం ఆగిపోనున్నాయి. తెలంగాణ నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకే టీఎస్ ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది. అయితే ఆ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో అంతర్ రాష్ట్ర సర్వీసులపై ఆ ప్రభావం పడుతోంది. ఆయా స్టేట్‌లలో కేసులు తగ్గిన తర్వాతే ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనిపై టీఎస్ ఆర్టీసీ ఈడీ యాదగిరి కూడా క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

WTC Finalలో ఈరోజు కూడా ఆ టెన్షన్.. భారత్‌కి నిరాశ తప్పదా..?

Sun Jun 20 , 2021
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకి నిరాశే ఎదురవుతోంది. రెండు రోజులకి గానూ కేవలం 64.4 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమవగా.. బ్యాడ్ లైట్‌తో పదే పదే మ్యాచ్‌ నిలిచిపోతూ వచ్చింది.