WTC Finalలో జెమీషన్‌కి 5 వికెట్లు.. టెస్టుల్లో 70ఏళ్ల నాటి రికార్డ్‌ బ్రేక్

భారత్‌తో గత ఏడాది జరిగిన టెస్టు సిరీస్‌‌తో న్యూజిలాండ్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జెమీషన్.. ఇప్పుడు స్టార్‌గా ఎదిగిపోయాడు. రోహిత్, కోహ్లీ, పంత్‌లను ఔట్ చేసిన ఈ పొడవాటి పేసర్..

ప్రధానాంశాలు:భారత్‌తో ఫైనల్లో ఐదు వికెట్లు పడగొట్టిన జెమీషన్న్యూజిలాండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత70 ఏళ్ల నాటి రికార్డ్‌ని బ్రేక్ చేసిన జెమీషన్ ఎంట్రీ ఇచ్చిన ఏడాదన్నరలోనే భారత్‌తో సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఐదు వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీషన్.. 70 ఏళ్ల నాటి రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ 217 పరుగులకి ఆలౌటవగా.. రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (44), రిషబ్ పంత్ (4), ఇషాంత్ శర్మ (4), జస్‌ప్రీత్ బుమ్రా (0) వికెట్లని జెమీషన్ పడగొట్టాడు.

2020, ఫిబ్రవరి 21న టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన కైల్ జెమీషన్.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా 44 వికెట్లని మార్క్‌ని అందుకున్నాడు. ఈ మార్క్‌ని అతను కేవలం 8 టెస్టుల్లోనే అందుకోగా.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ఎవరూ ఇన్ని తక్కువ టెస్టుల్లో కనీసం 41 వికెట్ల మైలురాయిని కూడా చేరుకోలేదు.

టెస్టుల్లో వేగంగా 30-40కి వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ బౌలర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? ఆదివారం వరకూ జాక్ కౌయ్ టాప్‌లో ఉన్నాడు. 1937-49లో కివీస్‌కి ఆడిన జాక్.. అప్పట్లో 8 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టాడు. తాజాగా అతని రికార్డ్‌ని జెమీషన్ కనుమరుగు చేశాడు. ఇక మూడో స్థానంలో షేన్ బాండ్ (2001-2003) 38 వికెట్లతో ఉండగా.. డౌగ్ బ్రాస్‌వెల్ (33), హెడ్లీ హౌవర్త్ (32) టాప్-5లో కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అయోధ్య ట్రస్ట్ సభ్యుడి అక్రమాలపై ఫేస్‌బుక్‌ పోస్ట్.. జర్నలిస్ట్‌పై కేసు నమోదు!

Mon Jun 21 , 2021
ఓ ఎన్నారైకి చెందిన స్థలాన్ని శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు, ఆయన సోదరులు ఆక్రమించుకున్నారని జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ యూపీలో చర్చనీయాంశంగా మారింది.