కాంట్రాక్ట్ లెక్చరర్లకు కేసీఆర్ బంపరాఫర్.. జూన్ నుంచే కొత్త పీఆర్సీ అమలు

గతవారం తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,21,037 మంది ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పింఛనుదారులందరికీ 30 శాతం చొప్పున ఫిట్‌మెంట్‌ అమలు కానుంది.

ప్రధానాంశాలు:జూన్ నెల నుంచే ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు.కాంట్రాక్ట్ లెక్చరర్లకు జులై నుంచి కొత్త వేతనాలు.కేసీఆర్ నిర్ణయంతో ఐదు వేల మందికి లబ్ది.తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని వర్తింపజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు కొత్త పీఆర్‌సీ ప్రకారం పెరిగిన మూలవేతనాన్ని (బేసిక్‌ పే) జూన్‌ నెల నుంచే చెల్లించనున్నారు. వీరి జులై నుంచే కొత్త జీతాలు అందుతాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా గురువారం 104, 105, 106 ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం జూనియర్ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనం రూ.37,100 నుంచి రూ.54,220; డిగ్రీ, పాలిటెక్నిక్‌ అధ్యాపకులకు రూ.40,270 నుంచి రూ.58,850కు పెరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 5 వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు లబ్ది పొందనున్నారు. విద్యాశాఖ జీఓల కాపీలను మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి నుంచి తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల ఐకాస ఛైర్మన్‌ కనకచంద్రం అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల కనీస జీతం రూ.19 వేలకు పెరగనుంది. 2018 జులై 1 నాటికి ఉన్న డీఏ 30.392 శాతం మూల వేతనంలో కలుస్తుంది. మొత్తం 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయనుండగా.. అందుకు అనుగుణంగా ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను ప్రభుత్వం సవరించింది.

కాగా, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి పీఆర్‌సీ మేరకు ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌ పథకాన్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు తగినన్ని ఖాళీలు లేని నేపథ్యంలో గతంలో మాదిరిగా ఆరేళ్లకు ఒకసారి ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌ స్కీంను వర్తింపజేస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనాతో భారత్ సర్వనాశమయ్యింది.. చైనా పరిహారం చెల్లించాల్సిందే: ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Fri Jun 18 , 2021
Trump Accuses China కరోనా వైరస్ విషయంలో ముందు నుంచి చైనాపై విమర్శలు గుప్పిస్తోన్న అమెరికా మాజీ అధ్యక్షుడు మరోసారి డ్రాగన్‌పై నిప్పులు చెరిగారు.