టీ20లో ఫాస్ట్ బౌలర్ సంచలనం.. 3 పరుగులిచ్చి 7 వికెట్లు

టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నెదర్లాండ్స్ ఫాస్ట్ బౌలర్ 3 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టింది. దెబ్బకి ప్రత్యర్థి టీమ్ 33 పరుగులకే ఆలౌటవగా.. లక్ష్యాన్ని 3.4 ఓవర్లలోనే నెదర్లాండ్స్ ఛేదించేసింది.

ప్రధానాంశాలు:టీ20 మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టిన నెదర్లాండ్స్ బౌలర్4 ఓవర్లు వేసి 3 పరుగులే ఇచ్చిన పేసర్ప్రత్యర్థి ఫ్రాన్స్ 33 పరుగులకే ఆలౌట్లక్ష్యాన్ని 3.4 ఓవర్లలోనే ఛేదించిన నెదర్లాండ్స్ఇంటర్నేషనల్ టీ20లో నెదర్లాండ్స్ మహిళా టీమ్ ఫాస్ట్ బౌలర్ ఫ్రెడరిక్ అరుదైన రికార్డ్ నెలకొల్పింది. మహిళల టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఫ్రెడరిక్ కేవలం 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.

ఫ్రెడరిక్ దెబ్బకి మొదట బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ టీమ్ 17.5 ఓవర్లలో 33 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని 3.4 ఓవర్లలోనే నెదర్లాండ్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించేసింది. ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇప్పటి వరకూ నేపాల్‌కి చెందిన అంజలి ఛాంద్ పేరిట ఉంది. 2019లో మాల్దీవులతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంజలి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే 6 వికెట్లు పడగొట్టింది. తాజాగా ఆ రికార్డ్‌ని ఫ్రెడరిక్ కనుమరుగు చేసింది.

ఫ్రాన్స్ టీమ్‌లో పాపీ మెగాన్ 8 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఫ్రెడరిక్ 7/3, ఇవా లైంచ్ 1/3 సత్తాచాటారు. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్‌ బ్యాటర్లు రోబిన్ రిజ్కే 21 పరుగులతో అజేయంగా నిలవగా.. ఫ్రాన్స్ బౌలర్ గ్రాహమ్‌కి ఒక వికెట్ దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రెడ్‌మీ నోట్ 10 ధర ఏకంగా ఐదుసార్లు పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

Fri Aug 27 , 2021
షియోమీ ఈ సంవత్సరం మార్చిలో రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ధరను కంపెనీ ఐదోసారి పెంచింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది.