గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున.. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ త్వరలోనే

కింగ్ నాగార్జున అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమాని త్వరలోనే తెరకెక్కిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కోవిడ్ ఉపద్రవం కాస్త సద్దుమణిగిన తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటిస్తామని.. ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. భారీ బడ్జెట్‌తో రూపొందించిన అతని తొలి సినిమా ‘అఖిల్’ అతనికి సక్సెస్ అందించలేదు. ఆ తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలు కూడా నిరాశపరిచాయి. దీంతో అఖిల్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతను భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. ఈ సినిమాతో ఎట్టిపరిస్థితిలో సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు అఖిల్.

మరోవైపు నాగార్జున ఈ మధ్యే ‘వైల్డ్‌డాగ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా నిరాశపరిచినప్పటికీ.. ఓటీటీలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఎప్పటి నుంచో అఖిల్, నాగార్జున కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ కోసం అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతంలో ‘మనం’ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. కానీ, ఈ సినిమాలో అఖిల్‌ది ఫుల్ లెంత్ పాత్ర కాదు. ఇప్పుడు నాగార్జున, అఖిల్‌లు కలిసి ఓ ఫుల్ లెంత్ మల్టీ స్టారర్ చేస్తే.. చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.

తాజాగా నాగార్జున దీనిపై ప్రకటన చేశారు. ఓటీటీలో వైల్డ్‌డాగ్ సక్సెస్ సాధించడంపై నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో తాను అఖిల్ కలిసి మల్టీస్టారర్ చేస్తున్నామని.. కరోనా పరిస్థితులు అనుకూలించిన తర్వాత దీనిపై ప్రకటన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగార్జున, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోవిడ్ కేసుల కారణంగా వాయిదా పడింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా కోవిడ్ పరిస్థితులు మెరుగైన తర్వాత విడుల అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఢిల్లీకి గుడ్‌న్యూస్.. బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

Sun Apr 25 , 2021
ఆక్సిజన్ కొరతతో సర్ గంగారాం ఆస్పత్రిలో 25 మంది చనిపోయారు. మరుసటి రోజే జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో మరో 25 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రతకు అద్దం పట్టే ఘటనలివి.