అందుకే ‘బంగార్రాజు’ తీస్తున్నా.. అసలు విషయం చెప్పిన నాగార్జున

ఏఎన్నార్ అంటే అందరికీ సోగ్గాడు, దసరా బుల్లోడు, తెరపై సరదాగా అల్లరి చేసిన పాత్రలు గుర్తుకు వస్తుంటాయి. ఇక ఏఎన్నార్ పంచెకట్టుతో కనిపించిన చిత్రాలెన్ని ఉంటాయో లెక్కపెట్టలేం. అలా ఏఎన్నార్ పంచెకట్టును గుర్తుకు తీసుకొచ్చేందుకు సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రాజు పాత్రను పెట్టేశారు.

ప్రధానాంశాలు:ఏఎన్నార్ జయంతిబంగార్రాజుపై నాగ్ అప్డేట్నాన్నకు ప్రేమతో అనేలా బంగార్రాజుఏఎన్నార్ అంటే అందరికీ సోగ్గాడు, దసరా బుల్లోడు, తెరపై సరదాగా అల్లరి చేసిన పాత్రలు గుర్తుకు వస్తుంటాయి. ఇక ఏఎన్నార్ పంచెకట్టుతో కనిపించిన చిత్రాలెన్ని ఉంటాయో లెక్కపెట్టలేం. అలా ఏఎన్నార్ పంచెకట్టును గుర్తుకు తీసుకొచ్చేందుకు సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రాజు పాత్రను పెట్టేశారు. అనుకున్నట్టుగానే బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ దక్కింది. అందుకే సపరేట్‌గా బంగార్రాజు అనే సినిమాను కూడా నాగార్జున ప్లాన్ చేసేశాడు. అయితే ఈ మూవీకి, ఏఎన్నార్‌కు ఉన్న సంబంధాన్ని నాగ్ వివరించాడు.

ఏఎన్నార్ జయంతి సందర్భంగా నాగార్జున ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో నాగ్ మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 20వ తారీఖు. నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. నా హీరో, నా స్ఫూర్తి ప్రధాత, నాన్న గారి పుట్టిన రోజు. నాన్నగారికి పంచెకట్టు అంటే చాలా ఇష్టం. ఆయన పంచె కట్టుకుంటే చూసినప్పుడల్లా ముచ్చటేసేది. ఆయనకు పొందూరు ఖద్దరు అంటే చాలా ఇష్టం.

ఇది పొందూరు ఖద్దరే. ఇది నవరత్నాల హారం. ఇది నవరత్నాల ఉంగరం. ఈ వాచ్ నాకంటే సీనియర్. ఆయన ఫేవరేట్ వాచ్..ఇప్పుడు నా ఫేవరేట్ వాచ్. ఇవన్నీ వేసుకుంటే..ఆయన నాతోనే ఉన్నట్టు ఉంటుంది. ఏదో తృప్తి. నాన్న గారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే మా ఈ ప్రయత్నం. ఏఎన్నార్ లివ్స్ ఆన్’ అంటూ అసలు విషయాన్ని చెప్పేశాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టుడే ఇన్‌స్టా హిట్స్: తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి.. కర్రసాము చేస్తున్న అదా.. వాళ్లతో కలిసి మంజూషా డ్యాన్స్

Mon Sep 20 , 2021
సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు ప్రతీ రోజు ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. అలా సెలబ్రటీలు పోస్ట్ చేసిన ఆసక్తికర విషయాలను మీ ముందు ఉంచాలనేదే మా ఈ ప్రయత్నం. ఈ రోజు (సెప్టెంబర్ 20న) సెలబ్రిటీలు పోస్ట్ చేసిన అప్‌డేట్స్ ఏంటో ఓ లుక్ వేయండి.