‘మీ మాటలు ఎంతో కదిలించాయి’.. చిరు, అమీర్‌ల గురించి నాగచైతన్య ట్వీట్

నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరి’. ఆదివారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యారు.

మంచి ప్రేమకథ, కుటుంబ విలువలు, ఓ గొప్ప సందేశంతో సినిమాలు తెరకెక్కిస్తుంటారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ఇప్పటివరకూ తీసిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లు కావడమే కాదు.. మ్యూజికల్‌గా కూడా మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. అయితే ‘ఫిదా’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆయన మరోసారి మంచి ప్రేమకథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమానే ‘లవ్‌స్టోరి’. నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలాకాలమే అయింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది.

ఎట్టకేలకు అన్ని అనుకూలంగా ఉండటంతో ఈ సినిమాను ఈ సెప్టెంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు.. రీసెంట్‌గా విడుదలైన సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ముఖ్యంగా కొత్త సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అయితే సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంగా చిత్ర యూనిట్ ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవిలు హాజరు అయ్యారు.

ప్రస్తుతం నాగచైతన్య.. అమీర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్ధా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరింది. అయితే నాగ చైతన్య ఆహ్వానం మేరకు ఈ వేడుకకు హాజరైన అమీర్ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చైతన్య, సాయి పల్లవిలపై ప్రశంసల వర్షం కురిపించారు. సాయి పల్లవితో కలిసి ఆయనకు డ్యాన్స్ చేయాలని ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే వీరిద్దరు తమ ఈవెంట్‌కు హాజరుకావడంపై నాగచైతన్య హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఈవెంట్‌ని విజయవంతం చేసినందుకు చిరంజీవి మరియు అమీర్ ఖాన్‌లకు నా ధన్యవాదాలు.. మీ మాటలు మా అందరిని ఎంతో కదిలించాయి’ అంటూ చైతన్య ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అందుకే ‘బంగార్రాజు’ తీస్తున్నా.. అసలు విషయం చెప్పిన నాగార్జున

Mon Sep 20 , 2021
ఏఎన్నార్ అంటే అందరికీ సోగ్గాడు, దసరా బుల్లోడు, తెరపై సరదాగా అల్లరి చేసిన పాత్రలు గుర్తుకు వస్తుంటాయి. ఇక ఏఎన్నార్ పంచెకట్టుతో కనిపించిన చిత్రాలెన్ని ఉంటాయో లెక్కపెట్టలేం. అలా ఏఎన్నార్ పంచెకట్టును గుర్తుకు తీసుకొచ్చేందుకు సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రాజు పాత్రను పెట్టేశారు.