మరో సీనియర్ యాక్టర్ ప్రాణాలు బలిగొన్న కరోనా.. దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ

రెండో దశలో కరోనా మహమ్మారి కోరలు చాచుకొని విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు లలిత్ భేల్ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో సినీ పెద్దలు అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.

రెండో దశలో కోరోనా రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ దశలో వైరస్ కట్టడికి ప్రభుత్వాలు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు ఈసారి కరోనా వైరస్ ప్రభావం సినీ తారలపై గట్టిగానే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతీ ఇండిస్ట్రీకి చెందిన వారు వైరస్ బారిన పడుతున్నారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.

తాజాగా తితిలీ, ముక్తీ భవన్ సినిమాలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు లలిత్ భేల్(71) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అతని కుమారుడు కను భేల్ వెల్లడించారు. ‘ఆయనకి గతంలోనే గుండె సంబంధిత వ్యాధి ఉంది. తాజాగా కరోనా కూడా రావడంతో పరిస్థితి మరింత విషమించింది. ఉపిరితిత్తులు కూడా పాడయ్యాయి. దీంతో ఆయన ఈ మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయారు’ అని కను భేల్ స్పష్టం చేశారు.

దూర్‌దర్శన్‌లో ప్రసారమయ్యే తపీశ్, ఆతీశ్, సునేరీ జిల్ద్ సిరీయల్స్‌లో ఆయన కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 2014లో వచ్చిన తితిలీ, ముక్తీ భవన్ సినిమాల్లో పాటు ఆమెజాన్ ప్రైమ్‌లో నటించిన మేడ్ ఇన్ హెవెన్, జడ్జ్‌మెంటల్ హే క్యా వీడియో సిరీస్‌లలో ఆయన నటించారు. లలిత్ మృతితో బాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ముక్తీ భవన్‌లో ఆయన కొడుకుగా నటించిన అదిల్ హుస్సేన్ లలిత్ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు. ‘‘లలిత్ భేల్ గారు చనిపోయారని తెలిసి నా మనస్సు విరిగిపోయింది. ముక్తీ భవన్‌లో ఆయన నటన అద్భుతం. మా నాన్న మళ్లీ చనిపోయినట్లు అనిపించింది. కను నీకు ఏర్పడిన లోటు ఎవరూ తీర్చ లేనిది’’ అంటూ అదిల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆమెకి అహంకారం.. అందుకే మోదీతో అలా.! జాతీయ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Sun Apr 25 , 2021
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై షాకింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఆమె ఏదీ సరిగ్గా చేయలేరని విమర్శించారు.