పాలు నీళ్లైనా ఫర్వాలేదు.. మరీ పేకముక్కలేంటి? ‘నందమూరి’పై రఘురామ షాకింగ్ కామెంట్స్

తెలుగు – సంస్కృత అకాడమీ వ్యవహారంపై రెబల్ ఎంపీ రఘురామ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అకాడమీ చైర్ పర్సన్ సమర్థించడాన్ని ఆయన తప్పుబట్టారు. పెద్దవారు అంటూ సునిశిత విమర్శలు చేశారు.

తెలుగు అకాడమీ పేరు మార్పు వివాదం రోజురోజుకీ ముదురుతోంది. తెలుగు భాష మనుగడకే ప్రమాదమని ఇప్పటికే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు తన స్టైల్లో స్పందించారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు – సంస్కృత అకాడమీగా మార్చడమేంటని ఆయన ప్రశ్నించారు. సంస్కృత భాషను అభివృద్ధి చేయాలనుకుంటే వేరే అకాడమీ పెట్టుకోవాలని.. తెలుగు అకాడమీని మార్చడమేంటని భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారని రఘురామ అన్నారు.

తెలుగు అకాడమీ పేరు మార్పును అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సమర్థించడాన్ని రఘురామ తప్పుబట్టారు. ఆమె వయసులో పెద్దవారని.. అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చడాన్ని సమర్థించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటని ఆమె ప్రశ్నిస్తున్నారని.. అకాడమీ చైర్‌ పర్సన్ హోదాలో లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు.

అంతేకాకుండా తెలుగు, సంస్కృతం పేకముక్కల్లా కలిసిపోతాయని లక్ష్మీపార్వతి అన్నారని.. కనీసం పాలు, నీళ్లలా కలిసిపోతాయని కూడా అనలేదని రఘురామ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పేకముక్కల్లా కలిసిపోతాయనడమేంటని ఆయన ప్రశ్నించారు. జూదప్రియులకు మినహా మరెవరికీ ఆమె మాటలు రుచించవన్నారు. ఆమె వాడిన పదం ఇబ్బందికరంగా ఉందని.. తెలుగు భాషను ప్రేమించేవారంతా బాధపడతున్నారని అన్నారు. తక్షణమే ఆమె తన పేకముక్కల వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు.

Also Read: రోజాకి బిగ్‌ షాక్.. కీలక పదవి నుంచి తప్పించిన జగన్.. ఆమె మంచికేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏపీలో పదవుల జాతర.. కీలక పోస్టులు ‘వారికే’నట.!

Sat Jul 17 , 2021
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీతో కోలాహలం నెలకొంది. ఒక్కసారిగా 135 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలు జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కీలక పోస్టులు ఒకే వర్గానికి కట్టబెట్టడంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.