ఆ సినిమా హిట్ అయితే మహా నాయకుడిని కోల్పోయేవాళ్లం: ఓ రేంజ్‌లో రఘురామ సెటైర్లు

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు. ఆయన సినిమా ప్రజలు చూడకపోవడంతోనే ప్రజలు మహా నాయకుడిని కోల్పోయేవారని అన్నారు.

ప్రధానాంశాలు:ఎంపీ భరత్‌పై రఘురామ సెటైర్లుఆయన సినిమా ప్లాప్ కాకుంటే మహానేతను కోల్పోయేవారులోక్‌సభ స్పీకర్ నిర్ణయాలను కూాడా వారే తీసుకుంటున్నారని ఎద్దేవాతనపై అనర్హత వేటు వేసేలా పావులు కదుపుతున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడుతుంది.. నర్సాపురం నియోజకవర్గ సమస్యలు సీఎం జగన్ నన్ను చూసుకోమన్నారు’ అని భరత్‌ వ్యాఖ్యానించడంపై రఘురామ స్పందించారు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయాలను కూడా తమ పార్టీ నాయకులే తీసుకుంటున్నట్లు తనకు తెలియదని ఎద్దేవా చేశారు.

Also Read: జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌పై 26న తీర్పు పక్కా: ఎంపీ రఘురామ జోస్యం

‘భరత్‌ను స్వాగతిస్తున్నా. ఆయన ఓ సినిమాలో నటించారు. అయితే ప్రజలు దాన్ని చూడకపోవడంతో ప్లాప్ అయింది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. లేకపోతే రాష్ట్ర ప్రజలు ఓ మహా నాయకుడిని కోల్పోయేవారు. రాజమండ్రిలో ప్రజలు నివసించేందుకు ఆవ భూమిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి మనసు దోచిన ఆయన అనేక నియోజకవర్గాలకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని వ్యంగ్యంగా అన్నారు.

తనపై అనర్హత అంశంలో లోక్‌సభను స్తంభింపజేస్తామని ప్రగల్భాలు పలికే వారు ఆ విద్యను ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్‌పై ఎందుకు వినియోగించడం లేదని రఘురామ ప్రశ్నించారు. మీ కేసుల విచారణ 11 ఏళ్లుగా జరుగుతుంటే నా కేసుల విచారణ వెంటనే జరగాలని కోరడమేంటని ప్రశ్నించారు. తన అనర్హతపై వారి ఆశలు అడియాశలుగా మిగిలిపోతాయని, తన ఆశయం నెరవేరుతుందనే నమ్మకం తనకుందని చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని రఘురామ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవి తింటున్నారా.. అస్సలు మంచిది కాదట..

Thu Jul 15 , 2021
చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో అనేక తప్పులు చేస్తూ ఉంటారు. కొందరైతే అసలు బ్రేక్‌ఫాస్ట్‌ని మొత్తానికే స్కిప్ చేస్తారు. మరికొందరైతే స్పీడ్ స్పీడ్‌గా ఒక బౌల్లో ధాన్యాలు (cereals) వేసుకుని దాని నిండా పాలు పోసుకుని తినేస్తుంటారు.