మోటొరోలా బడ్జెట్ 5జీ ఫోన్ సేల్ మొదలైంది.. 108MP కెమెరా, ఓఎల్ఈడీ స్క్రీన్ కూడా!

మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్ ధర రూ.21,499 నుంచి ప్రారంభం కానుంది.

ప్రధానాంశాలు:మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ సేల్ ప్రారంభంధర రూ.21,499 నుంచి ప్రారంభంమోటొరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ ఫోన్‌తో పాటు ఎడ్జ్ 20 ఫ్యూజన్ కూడా మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సేల్ మనదేశంలో ఈరోజు ప్రారంభం అయింది. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా, ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను అందించారు. ఈ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ, శాంసంగ్ గెలాక్సీ ఎం42, ఎంఐ 10ఐలతో పోటీ పడనుంది.

మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. సైబర్ టియల్, ఎలక్ట్రిక్ గ్రాఫైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనిపై పలు లాంచ్ ఆఫర్లు కూడా కంపెనీ అందించింది.
ఈ నోకియా ఫోన్ వాడేవారికి గుడ్‌న్యూస్.. కొత్త అప్‌డేట్ వచ్చేసింది!
మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ మ్యాక్స్ విజన్ డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు. 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. టర్బో పవర్ 30 ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.
మోటో జీ50 5జీ వచ్చేసింది.. బడ్జెట్‌లోనే 5జీ ఫోన్!
Motorola Edge 20 Fusion స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిపెర్ఫార్మెన్స్Mediatek Dimensity 800Uడిస్_ప్లే6.67 inches (16.94 cm)స్టోరేజ్_ఫైల్128 GBకెమెరాా108 MP + 8 MP + 2 MPబ్యాటరీ5000 mAhprice_in_india21499ర్యామ్6 GBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిఇతర వేరియంట్లు Motorola Edge 20 Fusion Motorola Edge 20 Fusion 128GB 8GB RAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టీ20లో ఫాస్ట్ బౌలర్ సంచలనం.. 3 పరుగులిచ్చి 7 వికెట్లు

Fri Aug 27 , 2021
టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నెదర్లాండ్స్ ఫాస్ట్ బౌలర్ 3 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టింది. దెబ్బకి ప్రత్యర్థి టీమ్ 33 పరుగులకే ఆలౌటవగా.. లక్ష్యాన్ని 3.4 ఓవర్లలోనే నెదర్లాండ్స్ ఛేదించేసింది.