ఈ ఫోన్ సబ్బుతో కడిగేయచ్చు.. మోటొరోలా సూపర్ స్ట్రాంగ్ ఫోన్ వచ్చేసింది!

మోటొరోలా తన కొత్త స్మార్ట్ ఫోన్ డిఫైని లాంచ్ చేసింది. ఇది ఒక రగ్గ్‌డ్ ఫోన్. అంటే దీన్ని రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించవచ్చన్న మాట. ఈ ఫోన్‌ను సబ్బుతో కడిగేయవచ్చని మోటొరోలా పేర్కొంది.

ప్రధానాంశాలు:మోటొరోలా డిఫైని లాంచ్ చేసిన కంపెనీధర రూ.30 వేలలోపే..మోటొరోలా కొత్త ఫోన్ లాంచ్ అయింది. అదే మోటొరోలా డిఫై రగ్గ్‌డ్ ఫోన్. ఇంగ్లండ్‌కు చెందిన బుల్లిట్ గ్రూప్ భాగస్వామ్యంతో మోటొరోలా ఈ ఫోన్ రూపొందించింది. ఈ ఫోన్‌లో ఐపీ68 రేటింగ్, ఎంఐఎస్-ఎస్‌పీఈసీ 810హెచ్ సర్టిఫికేషన్ కూడా ఉండనుంది. ఇది ప్రస్తుతానికి యూరోప్, లాటిన్ అమెరికాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

మోటొరోలా డిఫై ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 279 యూరోలుగా(సుమారు రూ.28,700) నిర్ణయించారు. ఫోర్జ్‌డ్ గ్రీన్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వచ్చేవారం యూరోపియన్, లాటిన్ అమెరికా మార్కెట్లలో ఈ ఫోన్ సేల్ జరగనుంది.
రెండు ఫోన్లు, ఒక టీవీ లాంచ్ చేయనున్న రియల్‌మీ.. అన్నీ రూ.15 వేలలోపే!
మోటొరోలా డిఫై స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్‌గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఇందులో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11కు దీన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

డ్యూయల్ సిమ్, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ వాటర్ ప్రూఫ్ పోర్టు, డ్యూయల్ సూపర్ లీనియర్ స్పీకర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఎంఐఎస్-ఎస్‌పీఈసీ 810హెచ్ సర్టిఫికేషన్ కూడా అందించారు. కేటగిరి 4 వైబ్రేషన్, తేమ, థర్మల్ షాక్ నుంచి రక్షణ కలిగే విధంగా దీన్ని రూపొందించారు. +55 డిగ్రీల నుంచి -25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను ఇది తట్టుకోనుంది. దీన్ని సబ్బుతో కడిగేయవచ్చని కంపెనీ అంటోంది. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 1.09 సెంటీమీటర్లుగానూ, బరువు 232 గ్రాములుగానూ ఉంది.
శాంసంగ్ ఎఫ్22 వచ్చేస్తోంది.. ప్రూఫ్ ఇదే.. మరి ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Motorola DEFY స్పెసిఫికేషన్లుపూర్తి స్పెసిఫికేషన్లు చూడండిస్టోరేజ్_ఫైల్2 GBకెమెరాా5 MPబ్యాటరీ1540 mAhడిస్_ప్లే3.7" (9.4 cm)ర్యామ్512 MBపూర్తి స్పెసిఫికేషన్లు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

EPFO 5 కొత్త రూల్స్.. పీఎఫ్ ఖాతాదారులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలివే!

Fri Jun 18 , 2021
మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు పీఎఫ్ అకౌంట్ గురించి బాాగా తెలిసే ఉంటుంది. ఈపీఎఫ్‌వో ఇటీవల కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.