ఆ యూట్యూబ్ ఛానెల్ వేధిస్తోంది… సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు

సోషల్‌మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలపై వేధింపులు కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో ఒకరిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడం చాలా కాలంగా జరుగుతోంది. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విషయంలోనూ ఇదే జరిగింది.

సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దాని వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అదేస్థాయిలో నష్టం కూడా జరుగుతోంది. గతంలో ఓ సెలబ్రిటీ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే.. ఎంతో శ్రమపడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్‌మీడియా కారణంగా ఇది సులభమైంది. సెలబ్రిటీలు కూడా తమ విషయాలను వెల్లడించేందుకు గత కొంతకాలంగా సోషట్‌మీడియానే వినియోగిస్తున్నారు. ఎంతో విజ్ఞానాన్ని అందించే ఈ మాద్యమాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే.. వారిపై ట్రోల్స్, అసభ్యకరమైన పోస్ట్‌లు చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి చేదు అనుభవమే.. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఎదురైంది. తనని ఓ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ చేస్తూ అసభ్యపదజాలంలో ట్రోల్ చేస్తోందని మోహన్‌బాబు సైబర్ క్రైమ్ పోలీసుల ఆశ్రయించారు. తనను వ్యక్తిగతంగా తిడుతుండటమే కాకుండా… అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా చేసే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. మోహన్ బాబు ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.

మోహన్ బాబు లీగల్ అడ్వైజర్ సంజయ్ ఈ ఫిర్యాదును పోలీసులకు అందించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మోహన్‌బాబు ప్రస్తుతం ‘సన్‌ ఆఫ్ ఇండియా’ అనే సినిమాలో నటిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాక.. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం ‘శాకుంతలం’లో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

OTTపై కోటా కొరడా.. లక్ష సంపాదనకి నాకు 26 ఏళ్లు పట్టింది: కోటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

Sat Jul 10 , 2021
ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. ప్రైమ్, ఆహా, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ ఇలా అనేకమైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా వినోదం మొత్తం ప్రేక్షకుడి చేతిలోనే ఉంటుంది.