కరోనా కష్ట కాలంలో పెద్ద మనసు.. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి, కేటీఆర్ కలిసి!

గుప్తా అనే వ్యక్తి కేటీఆర్‌కు సోమవారం ట్వీట్‌ చేశారు.. తన సోదరికి సాయం చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.. తప్పకుండా అంటూ.. తన స్నేహితుడు ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సాయం చేస్తారన్నారు.

ప్రధానాంశాలు:కేటీఆర్‌కు గుప్తా అనే వ్యక్తి ట్వీట్వెంటనే స్పందించిన మంత్రిమంత్రి గౌతమ్‌తో కలిసి సాయంతెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది.. ఎమర్జెన్సీ కేసులు పెరుగుతున్నాయి. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లకు డిమాండ్ పెరుగుతోంది.. కొంతమందికి ఈ ఇంజెక్షన్లు దొరక్క ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి రెమ్‌డెసివిర్ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రిక్వెస్ట్ చేశారు. ఆయన సకాలంలో స్పందించి ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలిసి సాయం చేశారు.

గుప్తా అనే వ్యక్తి కేటీఆర్‌కు సోమవారం ట్వీట్‌ చేశారు.. తన సోదరికి సాయం చేయాలని కోరారు. ‘మా సోదరి విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అవసరం. నిజంగా మీరు దేవుడు. దయచేసి మా ఆంధ్ర ప్రజలకు సహాయం చేయరా’’ అన్నారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.. తప్పకుండా అంటూ.. తన స్నేహితుడు ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సాయం చేస్తారంటూ గుప్తాకు తిరిగి ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత గౌతంరెడ్డితో మాట్లాడారు. ఈ మేరకు ఏపీ మంత్రి కార్యాలయ సిబ్బంది స్పందించి.. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్న్లు ఏర్పాటు చేశారు. ఇలా అత్యవసర సమయంలో సాయం చేసినందుకు మంత్రులు కేటీఆర్‌, మేకపాటి గౌతంకు గుప్తా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. నిరాడంబరంగా వేడుకలు

Tue Apr 27 , 2021
ఈసారి పార్టీ వార్షికోత్సవ వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో అంతా కోవిడ్ నిబంధనలు పాటించి సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు మంత్రి కేటీఆర్.