వాడెవ్వడు.. మా సీఎం మహాత్ముని తిట్టడానికి.! మల్లారెడ్డి శాపనార్థాలు

మంత్రి మల్లా రెడ్డి మరోమారు నోటికి పనిచెప్పారు. తన పాత సహచరుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పురుగులపట్టి చచ్చిపోతాడంటూ శాపనార్థాలు పెట్టారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లా రెడ్డి వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇటీవల సద్దుమణిగింది అనిపించినా.. అవకాశం చిక్కితే ఒకరిపై మరొకరు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. జవహర్ ‌నగర్‌లో టీఆర్‌ఎస్‌లో చేరికల సందర్భంగా మంత్రి మల్లా రెడ్డి మరోమారు నోటికి పనిచెప్పారు. రేవంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మన సీఎంని తిట్టడానికి వాడెవ్వడు.. మన కేటీఆర్‌ని తిట్టడానికి వాడెవ్వడు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

‘మన సీఎం మహాత్ముడు.. గొప్పమనసు.. గొప్పనాయకుడు, ప్రేమ ఉన్నోడు.. మనకోసమే ఆలోచన చేస్తాడు రాత్రీపగలు.. అలాంటి సీఎంని పట్టుకుని తిడతాడా? పురుగులపడి చచ్చిపోతాడు’ అంటూ శాపనార్థాలు పెట్టారు. యాభై కోట్టు పెట్టుకుని పీసీసీ కొనుక్కున్నోడు.. చర్లపల్లి జైలుకెళ్లొచ్చినోడంటూ రేవంత్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. గత పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని.. ఏం చేశారని ప్రశ్నించారు. కరెంటు ఇచ్చారా? నీళ్లు ఇచ్చారా? అని నిలదీశారు. మన సీఎంని తిట్టడానికి వాడెవ్వడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనల్ని ఆదుకునేటోళ్లని రేవంత్ తిడుతున్నాడని మండిపడ్డారు.

గతంలో మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన దళిత, గిరిజన దందోరా సభలో మంత్రి మల్లా రెడ్డి భూములు కబ్జా చేశాడని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పాలు అమ్ముకునే మల్లా రెడ్డికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై మండిపడిన మల్లా రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి రమ్మంటూ సవాల్ విసిరారు. తొడగొట్టి మరీ రేవంత్‌కి చాలెంజ్ చేశారు. తాజాగా మరోమారు రేవంత్‌పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: దుమారం రేపుతోన్న డ్రగ్స్ యవ్వారం.. నన్నెందుకు లాగారో.. మాజీ ఎంపీ షాక్! అయినా ఓకే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్​​ సింగ్.. కాంగ్రెస్ దళిత మంత్రం, అదిరే మాస్టర్ ప్లాన్!

Sun Sep 19 , 2021
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి తెరపడింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళిత సామాజిక వర్గానికి చెందిన నేత నియమితులయ్యారు.