ఈటల రాజేందర్ చేసిన తప్పు అదే.. మంత్రి KTR ఆసక్తికర వ్యాఖ్యలు

TRS Party: బండి సంజయ్ గురించి విమర్శలు చేస్తూ.. ఆయన అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.

ఈటల రాజేందర్ గురించి టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో కేటీఆర్ ప్రస్తావించారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నష్టం చేయలేదని అన్నారు. 2003లో ఈటల రాజేందర్‌కు ఎంత కష్టమైనా సరే పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. టీఆర్ఎస్‌లో పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీల నేతలతో ఈటల సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ భేటీలో మాట్లాడితే సరిపోయేదని.. కానీ, ఆయన అలా చేయలేదని అన్నారు.

ప్రజల్లో సానుభూతి కోసం వారి మధ్యలో మాట్లాడి ఆయనకు ఆయనే దూరమయ్యారని కేటీఆర్ చెప్పారు. హుజూరాబాద్‌లో పార్టీల మధ్యనే పోటీ ఉందని.. వ్యక్తుల మధ్య కాదని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురించి విమర్శలు చేస్తూ.. ఆయన అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యపై తప్ప ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఎలాంటి విషయం లేదని కేటీఆర్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ బడ్జెట్ ఒప్పో ఫోన్ ధర పెరిగింది.. అయినా రూ.15 వేలలోపే!

Wed Jul 14 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన ఒప్పో ఏ54 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో పెంచింది. వేరియంట్‌ను బట్టి రూ.500 నుంచి రూ.1,000 వరకు ఈ ధర పెరిగింది.