రేవంత్‌రెడ్డికి షాకిచ్చిన కేటీఆర్.. హైకోర్టులో పరువు నష్టం దావా

తనపై అసత్య ప్రచారం జరుగుతుందంటూ.. పరువు నష్టం దావా వేశారు మంత్రి కేటీ రామారావు. దుష్ప్రచారం చేసిన వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

ప్రధానాంశాలు:రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కేటీఆర్తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటుహైకోర్టులో పరువు నష్టం దావాడ్రగ్స్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న సవాళ్ల పర్వం హైకోర్టుకు చేరింది. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్ తాజాగా హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై దుష్ప్రచారం చేసిన వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా, వారికి ఇక శిక్ష తప్పదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

వైట్‌ ఛాలెంజ్‌ పేరిట కేటీఆర్‌, కొండా విశ్వేశ్వరరెడ్డిలు డ్రగ్స్‌ పరీక్షలు చేయించుకోవాలంటూ రేవంత్‌ రెడ్డి సవాలు విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. తాను పరీక్షలకు సిద్ధమే అని.. రాహుల్‌ గాంధీ రెడీనా అని ప్రతి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్‌ చట్టపరమైన చర్యలకు సిద్ధం అయ్యారు. ఆయన ట్వీట్‌పై స్పందించిన రేవంత్.. సహారా కుంభకోణం, ఇతర కేసుల్లో సీఎం కేసీఆర్ లై డిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

MPTC, ZPTC ఎన్నికల్లో వైసీపీ రీసౌండ్ విక్టరీ.. సీఎం జగన్ ఎమోషనల్ కామెంట్స్!

Mon Sep 20 , 2021
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ విజయం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.