అచ్చోసిన ఆంబోతులా వదిలారు.. అతనో పిచ్చికుక్క.. మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు, తనయుడు లోకేష్‌పై మరోమారు విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. అచ్చోసిన ఆంబోతులా లోకేష్‌ను వదిలేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీబీఐకి నో చెప్పిందే టీడీపీ అని గుర్తు చేశారు.

కర్నూలు జిల్లా పెసరవాయిలో టీడీపీ నేతల హత్య రాజకీయ రంగు పులుముకుంటోంది. దమ్ముంటే సీఎం జగన్ సీబీఐ ఎంక్వైరీ వేయాలని.. నువ్వు మగాడివైతే ఎంక్వైరీ వెయ్ అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నారా లోకేష్‌ను అచ్చోసిన ఆంబోతులా రోడ్డుపై వదిలేశారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

లోకేష్ పిచ్చికుక్క మాదిరిగా అరుస్తున్నాడని నాని మండిపడ్డారు. అసలు సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని జీవో ఇచ్చిందే చంద్రబాబు ప్రభుత్వమని కొడాలి నాని గుర్తు చేశారు. ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి నాని హెచ్చరించారు.

ధాన్యం కొనుగోలుపై సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ రాయడాన్ని మంత్రి తప్పుబట్టారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. చంద్రబాబు లేఖ రాయకముందే రూ.1600 కోట్లు చెల్లించామన్నారు. కేంద్రం ఇవ్వకపోయినా రైతులకు డబ్బు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు బాబు పెట్టిన బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించిందని ఆయన చెప్పారు. కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకి భయమని మంత్రి ఎద్దేవా చేశారు.

Also Read: ‘రూ.లక్ష కోట్ల స్కామ్‌కి జగన్ స్కెచ్… ఆ కంపెనీ వైసీపీ ఎంపీ బినామీది’.. టీడీపీ నేత సంచలన ఆరోపణలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

WTC Finalలో భారత్ ఫస్ట్ బ్యాటింగ్.. కివీస్ కెప్టెన్ అనూహ్య నిర్ణయం

Sat Jun 19 , 2021
ప్రతిష్ఠాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సౌథాంప్టన్‌లో శుక్రవారం వర్షం పడటంతో..