స్విట్జర్లాండ్‌కు కేటీఆర్.. ప్రపంచ ఆర్థిక సదస్సుకు అందిన ఆహ్వానం

వచ్చేఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు-2022కు హాజరు కావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుకు ఆహ్వానం అందింది.

ప్రధానాంశాలు:ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న సదస్సుహాజరు కావాలని లేఖ పంపిన వేదిక అధ్యక్షుడు బోర్గ్‌ బెండెవచ్చే ఏడాది స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు-2022కు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందించింది. జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు జరిగే సదస్సుకు వేదిక అధ్యక్షుడు బోర్గ్‌ బెండె… కేటీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్న కేటీఆర్.. కరోనా నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా కోలుకునేలా దార్శనికత చూపించారని బెండె కొనియాడారు. వీటన్నింటికీ గుర్తింపుగా ఆయనను తమ వార్షిక సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు వాటిని ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం, సామర్థ్యం పెంపుదల, సహకార మార్గాలపై మీ అభిప్రాయాలను వార్షిక సదస్సులో అందరితో పంచుకోవాలి అని బోర్గ్‌ కోరారు. బెండె ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి రాజకీయ, వ్యాపార – పౌరసమాజ నాయకులు పాల్గొనే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు తనను ఆహ్వానించడం రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, పరిశ్రమలు, ఆవిష్కరణ రంగాల్లో కనబరుస్తున్న ప్రతిభకు దక్కిన గౌరవంగా భావిస్తామన్నారు. తెలంగాణ పారిశ్రామిక అనుకూల విధానాలను ప్రపంచవేదిక వద్ద ప్రస్తావించి ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒక అవకాశంగా మలుచుకుంటామని కేటీఆర్ చెప్పారు. 2020 జనవరిలో జరిగిన సదస్సుకు కూడా కేటీఆర్‌ హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఫోన్ పే వాడే వారికి ఝలక్.. ఇకపై అలా చేస్తే..

Mon Sep 20 , 2021
మీరు ఫోన్ పే వాడుతున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఫోన్ పే వాలెట్‌కు క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు వేసుకోవాలని భావిస్తే.. అదనపు చార్జీలు చెల్లించుకోవాలి. 2 శాతం వరకు చార్జీలు పడుతున్నాయి.