కరోనా వ్యాప్తికి కారణం అదే.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రాలన్నీ కరోనా భయంతో వణుకుతున్నాయి. అయితే సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాప్తికి కారణం కేంద్రం ప్రభుత్వమే అంటూ మండిపడ్డారు ఎంపీ అసద్.

ప్రధానాంశాలు:కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందిబీజేపీ ప్రభుత్వానికి ముందు చూపు లేదుఅందుకే కరోనా కేసులు మళ్లీ పెరిగాయి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు లక్షల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య సైతం వేలల్లో నమోదు అవుతోంది. దేశమంతా కరోనా వైరస్ భయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. సోమవారం అసద్ మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోందని మండిపడ్డారు.

కరోనా మందులపై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని, వెంటనే ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరారు. హైదరాబాద్‌లో గాంధీ, టిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్నారు. అయితే కేసులు సంఖ్య పెరుగిపోతుండటంతో అందులో ఉన్న బెడ్స్ సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్‌ను నిర్మించాలని అసద్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పొట్టి వీరయ్య మృతిపై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్.. స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఎదిగిన న‌టుడంటూ!!

Mon Apr 26 , 2021
పొట్టి వీరయ్య మరణ వార్త విని మెగాస్టార్ చిరంజీవి కలత చెందారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.