రూ.4 వేలలోపే ఎంఐ అదిరిపోయే స్మార్ట్ బ్యాండ్.. అందుబాటులో ఆఫర్ కూడా!

షియోమీ తన కొత్త స్మార్ట్ బ్యాండ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6. దీని ధర రూ.3,499గా నిర్ణయించారు. ఆగస్టు 30వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.

ప్రధానాంశాలు:ఎంఐ బ్యాండ్ 6 వచ్చేసిందిధర రూ.3,499గా నిర్ణయించిన కంపెనీఎంఐ తన కొత్త స్మార్ట్ బ్యాండ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6. షియోమీ స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌లో ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మొత్తం 30 స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం విశేషం. బ్లూటూత్ వీ5.0 సపోర్ట్ కూడా ఇందులో అందించారు.

ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 ధర
దీని ధరను రూ.3,499గా నిర్ణయించారు. బ్లాక్ కలర్ స్ట్రిప్‌తో ఇది రానుంది. అదనంగా బ్లూ, లైట్ గ్రీన్, ఆరెంజ్, మెరూన్ రంగుల్లో దీన్ని స్ట్రిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిన ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సేల్ ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఎంఐ బ్యాండ్ వాడుతున్నవారు దీన్ని రూ.2,999కే కొనుగోలు చేయవచ్చు.
ఎంఐ కొత్త టీవీలు వచ్చేశాయ్.. అదిరిపోయే డిస్‌ప్లే.. ధర ఎంతంటే?
ఎంఐ స్మార్ట్ బ్యాండ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 1.56 అంగుళాల ఫుల్ స్క్రీన్ అమోఎల్ఈడీ టచ్ డిస్ ప్లేను అందించారు. ఎంఐ బ్యాండ్ 5లో 1.1 అంగుళాల అమోఎల్ఈడీ టచ్ స్క్రీన్ డిస్ ప్లేను అందించారు. దాని కంటే ఇది చాలా పెద్ద డిస్ ప్లే. దీని పిక్సెల్ డెన్సిటీ 326 పీపీఐగా ఉంది. 50 మీటర్ల లోతు వరకు వాటర్ ప్రూఫ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. కంపెనీ అందించింది

దీని బ్యాటరీ సామర్థ్యం 125 ఎంఏహెచ్‌గా ఉంది. 14 రోజుల వరకు స్టాండ్ బై టైం అందించనుంది. ఇది పూర్తిగా చార్జ్ కావడానికి రెండు గంటల వరకు టైం పడుతుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇందులో 80కి పైగా కస్టమైజబుల్ బ్యాండ్ ఫేస్‌లను కంపెనీ అందించింది.

ఇది ఫిట్‌నెస్ ట్రాకర్‌గా కూడా పనిచేయనుంది. ఇందులో మొత్తం 30 స్పోర్ట్స్ మోడల్స్ ఉన్నాయి. వాకింగ్, రన్నింగ్, ఇండోర్ ట్రెడ్ మిల్, సైక్లింగ్ వంటి మొత్తం ఆరు యాక్టివిటీలను ఇది ఆటో డిటెక్ట్ చేస్తుంది. ఎంఐ బ్యాండ్ 6లో బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఎస్‌పీఓ2 సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఆడవారి కోసం ప్రత్యేకంగా ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్ అనే ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీని ఇందులో అందించారు. దీని మందం 1.27 సెంటీమీటర్లుగా ఉండగా, బరువు కేవలం 12.8 గ్రాములు మాత్రమే.
రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మొదటి సేల్ ఈరోజే.. లాంచ్ ఆఫర్లు కూడా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

శరీరంలో కొవ్వు పెరగడానికి ఇదే కారణం..

Thu Aug 26 , 2021
ఈ స్మార్ట్​ యుగంలో ప్రతి ఒక్కరూ అధిక కొవ్వుతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా అధికంగా కొవ్వును కలిగి ఉండడానికి మన జీవనశైలి కూడా ఒక కారణమని అనేక మంది నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అధిక కొవ్వును కలిగి ఉండడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.