రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు లాంచ్ చేసిన ఎంఐ.. మంచి పెర్ఫార్మెన్స్ కోరుకునేవారికి బెస్ట్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. అవే ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా, ఎంఐ నోట్‌బుక్ ప్రో. వీటి ధర రూ.56,999 నుంచి ప్రారంభం కానున్నాయి.

ప్రధానాంశాలు:ఎంఐ నోట్ బుక్ అల్ట్రా, ప్రో వచ్చేశాయ్ధర రూ.56,999 నుంచి ప్రారంభంషియోమీ మనదేశంలో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. అవే ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా, ఎంఐ నోట్‌బుక్ ప్రో. షియోమీ స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్లో ఇవి లాంచ్ అయ్యాయి. వీటిలో 11వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లను అందించారు. వీటిలో బ్యాక్ లిట్ కీబోర్డ్, 16:10 యాస్పెక్ట్ రేషియో ఉన్న డిస్‌ప్లేను అందించారు.

ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా, ఎంఐ నోట్‌బుక్ ప్రో ధర
ఎంఐ నోట్‌బుక్ అల్ట్రాలో ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్ ధరను రూ.59,999గానూ, 16 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్ ధరను రూ.63,999గానూ నిర్ణయించారు. ఐ7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్ ధరను రూ.76,999గా ఉంది.

ఎంఐ నోట్‌బుక్ ప్రోలో ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్ ధర రూ.56,999గానూ, 16 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్ ధరను రూ.58,999గానూ ఉంది. ఐ7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్ ధరను రూ.72,999గా నిర్ణయించారు.

వీటికి సంబంధించిన సేల్ ఆగస్టు 31వ తేదీన ఎంఐ.కాం, అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్లలో జరగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే ఐ7 వేరియంట్లపై రూ.4,500, ఐ5 వేరియంట్లపై రూ.3,500 తగ్గింపు లభించనుంది.
రూ.4 వేలలోపే ఎంఐ అదిరిపోయే స్మార్ట్ బ్యాండ్.. అందుబాటులో ఆఫర్ కూడా!
ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా స్పెసిఫికేషన్లు
సిరీస్ 6 అల్యూమినియంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 15.6 అంగుళాల ఎంఐ ట్రూలైఫ్+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:10 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.

11వ తరం ఐ7 ప్రాసెసర్ వరకు ఇందులో అందించారు. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. ఫుల్‌సైజ్ బ్యాక్ లైట్ కీబోర్డును ఇందులో అందించారు. దీని బ్రైట్‌నెస్‌ను మూడు లెవల్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ వీ5.1, వైఫై 6, రెండు యూఎస్‌బీ టైప్-ఏ 3.2 జెన్ 2 పోర్టులు, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, థండర్ బోల్డ్ 4, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు కూఢా ఇందులో ఉన్నాయి.
ఎంఐ కొత్త టీవీలు వచ్చేశాయ్.. అదిరిపోయే డిస్‌ప్లే.. ధర ఎంతంటే?
యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు. బ్యాక్‌లైట్ కీబోర్డు లైటింగ్‌ను మూడు వేర్వేరు స్థాయిల్లో సెట్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద ట్రాక్‌ప్యాడ్‌ను అందించారు. గతంలో వచ్చిన ఎంఐ నోట్‌బుక్‌ల కంటే ఇది 62 శాతం పెద్దదని తెలుస్తోంది.

ఈ ల్యాప్‌టాప్‌లో 70Whr బ్యాటరీని అందించారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 12 గంటల బ్యాకప్‌ను ఇది అందించనుంది. 65W యూఎస్‌బీ టైప్-సీ పవర్ అడాప్టర్‌ను కూడా అందించారు. దీని మందం 1.79 సెంటీమీటర్లు కాగా, బరువు 1.7 కేజీలుగా ఉంది.

ఎంఐ నోట్‌బుక్ ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 14 అంగుళాల 2.5కే డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. 11వ తరం ఐ7 ప్రాసెసర్ వరకు ఇందులో అందించారు. 16 జీబీ వరకు ర్యామ్, 512 టీబీ ఎస్ఎస్‌డీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. దీని కనెక్టివిటీ, ఆడియో ఫీచర్లు ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా తరహాలోనే ఉన్నాయి.

ఇందులో 56Whr బ్యాటరీని అందించారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 11 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. దీని మందం 1.73 సెంటీమీటర్లు కాగా, బరువు 1.4 కేజీలుగా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 2లో కొత్త మోడల్.. సేల్ మొదలైపోయింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి షాక్!

Fri Aug 27 , 2021
మీరు కెనరా బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకోండి.