రూ.599 విలువైన ఇయర్‌ఫోన్స్ రూ.99కే.. ఎంఐ సూపర్ ఆఫర్!

షియోమీ తన వార్షిక సేల్‌లో భారీ ఆఫర్‌ను అందించింది. ఈ ఆఫర్ కింద రూ.599 విలువైన ఎంఐ ఇయర్‌ఫోన్స్ బేసిక్‌ను రూ.99కే కొనుగోలు చేయవచ్చు. జులై 16వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

ప్రధానాంశాలు:ఎంఐ వార్షిక సేల్ సందర్భంగా భారీ ఆఫర్రోజూ సాయంత్రం నాలుగు గంటలకు..షియోమీ తన వార్షిక్ సేల్‌ను నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో తన ఇయర్‌ఫోన్స్‌‌పై భారీ ఆఫర్‌ను అందించింది. రూ.599 విలువైన ఎంఐ ఇయర్ ఫోన్స్ బేసిక్‌ను రూ.99కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఈ ఎంఐ వార్షిక సేల్ జులై 16వ తేదీ వరకు జరగనుంది. అంటే అప్పటివరకు మాత్రమే ఈ ఆఫర్ ఉండనుందన్న మాట. వీటిని ఫ్లాష్ సేల్ తరహాలో విక్రయించనున్నారు. దీంతోపాటు వివిధ ఉత్పత్తులపై కూడా తగ్గింపును అందించనున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులపై ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.
రియల్‌మీ బుక్ ధర లీక్.. ఫీచర్లు కూడా.. లాంచ్ త్వరలోనే!
ఎంఐ 10టీ స్మార్ట్ ఫోన్ ధరను రూ.42,999 నుంచి రూ.34,999కు తగ్గించారు. అలాగే ఎంఐ 10టీ ప్రోపై కూడా తగ్గింపును అందించనున్నారు. దీని ధరను రూ.47,999 నుంచి రూ.36,999కు తగ్గించారు. వీటితోపాటు రెడ్‌మీ ఇయర్ ఫోన్స్, ఎంఐ కేఎన్-95 ప్రొటెక్టివ్ మాస్క్, ఎంఐ ట్రిమ్మర్‌లపై కూడా ఈ తగ్గింపును అందించారు.

ఎంఐ టీవీ 4ఏ 32 అంగుళాల మోడల్ ధరను రూ.19,999 నుంచి రూ.15,999కు తగ్గించారు. అంటే దీనిపై రూ.4,000 తగ్గింపును అందించారన్న మాట. అలాగే ఎంఐ టీవీ 4ఏ 40 అంగుళాల మోడల్ ధరను రూ.24,999 నుంచి రూ.22,999కు తగ్గించారు. దీంతోపాటు ఈ టీవీలు కొనుగోలు చేస్తే ఈ స్మార్ట్ స్పీకర్‌ను రూ.1,999కే కొనుగోలు చేయవచ్చు.

వీటితోపాటు ఎంఐ స్పోర్ట్స్ షూస్, ఎంఐ ఎకో యాక్టివ్ టీషర్ట్, ఎంఐ స్క్రూడ్రైవర్, ఎంఐ ట్రక్ డ్రైవర్, ఎంఐ సెల్ఫీ ట్రైపాడ్ వంటి ఇతర ఉత్పత్తులపై కూడా ఈ సేల్‌లో భారీ తగ్గింపును అందించనున్నారు.
ఈ శాంసంగ్ ఫోన్ ధర మళ్లీ పెరిగింది.. అయినా రూ.8 వేలలోపే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషణ్

Wed Jul 14 , 2021
ప్రగతి భవన్‌లో సీఎంను కలిశారు ఎమ్మెల్యే రసమయి. కేసీఆర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ​ఉద్యమంలో కష్టపడి పనిచేసిన సాంస్కృతిక కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు కేసీఆర్.