కొత్త ఫాస్ట్ చార్జర్ లాంచ్ చేసిన ఎంఐ.. ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ కొత్త ఫాస్ట్ చార్జర్‌ను లాంచ్ చేసింది. అదే ఎంఐ 67W సోనిక్ చార్జ్ 3.0 చార్జర్ కాంబో. దీని ధరను రూ.1,999గా నిర్ణయించారు.

ప్రధానాంశాలు:ఎంఐ 67W చార్జర్ వచ్చేసిందిధర రూ.1,999గా నిర్ణయించిన కంపెనీఎంఐ 67W సోనిక్ చార్జ్ 3.0 చార్జర్ కాంబో మనదేశంలో లాంచ్ అయింది. దీన్ని షియోమీ మేలోనే టీజ్ చేసింది. ఎంఐ 11 అల్ట్రా, ఇతర యూఎస్‌బీ టైప్-సీ డివైస్‌లకు ఇది ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. ఇందులో యూఎస్‌బీ టైప్-ఏ పోర్టు మాత్రమే ఉంది. దీంతోపాటు యూఎస్‌బీ టైప్-ఏ నుంచి టైప్-సీ కేబుల్‌ను కూడా అందించనున్నారు.

ఎంఐ 67W సోనిక్ చార్జ్ 3.0 చార్జర్ కాంబో ధర
ఎంఐ 67W సోనిక్ చార్జ్ 3.0 చార్జర్ కాంబో ధరను రూ.1,999గా నిర్ణయించారు. కేవలం వైట్ కలర్ మోడల్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.2,999గా ఉండగా, రూ.1,000 తగ్గింపుతో దీన్ని అందించనున్నారు.
నథింగ్ ఇయర్ 1 ధర ఇదే.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు!
ఎంఐ 67W సోనిక్ చార్జ్ 3.0 చార్జర్ కాంబో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఎంఐ 67W సోనిక్ చార్జ్ 3.0 చార్జర్ కాంబో పేరుకు తగ్గట్లే 67W అవుట్‌పుట్‌ను ఇవి అందించనున్నాయి. అంటే మీ డివైస్ 67W అవుట్‌పుట్‌ను సపోర్ట్ చేస్తే.. ఈ చార్జర్ మీకు ఉపయోగపడుతుందన్న మాట. దీంతోపాటు 6ఏ యూఎస్‌బీ టైప్-సీ కేబుల్ కూడా అందించనున్నారు. దీన్ని అడాప్టర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎంఐ 67W సోనిక్ చార్జ్ 3.0 చార్జర్ క్వాల్‌కాం క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీని సపోర్ట్ చేయనుంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ కూడా ఈ చార్జర్ పొందింది. దీన్ని పాలీకార్బనేట్‌తో రూపొందించారు. 5V at 3A, 9V at 3A, 20V at 1.35A, 20V at 3.35A, 11V at 6.1A చార్జింగ్ స్పీడ్‌లను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. ఇందులో వీ అంటే వోల్టేజ్ కాగా, ఏ అంటే ఆంపియర్.

100 సెంటీమీటర్ల టైప్-సీ కేబుల్‌ను ఇందులో అందించనున్నారు. దీనికి ఆరు నెలల వారంటీని కూడా అందించనున్నారు. ఈ చార్జర్‌లో టూ ప్రాంగ్ డిజైన్ అందించారు. దీని సైజు కూడా కాస్త చిన్నగానే ఉంది. డిజైన్ పూర్తిగా తెలుపు రంగులో ఉండి.. యూఎస్‌బీ పోర్టుల్లో మాత్రం నారింజ రంగులో ఉండనుంది.
నోకియా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది.. స్పెసిఫికేషన్లు లీక్.. లాంచ్ త్వరలోనే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ప్రతిరోజూ ఉదయం 10 గంటల్లోపు ఇలా చేస్తే చాలా మంచిదట..

Mon Jul 12 , 2021
ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఉంటుంది. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, జీవన విధానం అన్నీ సక్రమంగా ఉండాలి. జీవన విధానం నిజంగా మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది.