ఎంఐ సూపర్ ఫాస్ట్ చార్జర్ వచ్చేస్తుంది.. ఏకంగా 67W వేగంతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త ఫాస్ట్ చార్జర్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. అదే ఎంఐ 67W ఫాస్ట్ చార్జర్. జులై 12వ తేదీన ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది.

ప్రధానాంశాలు:జులై 12వ తేదీన లాంచ్చార్జర్‌లో కూడా బోలెడన్నీ ఫీచర్లుషియోమీ తన కొత్త ఫాస్ట్ చార్జర్‌ను టీజ్ చేసింది. అదే ఎంఐ 67W ఫాస్ట్ చార్జర్. ఈ చార్జర్ లాంచ్‌కు కూడా కంపెనీ ఈవెంట్‌ను నిర్వహిస్తూ ఉండటం విశేషం. దీనికి సంబంధించిన పలు ఫీచర్లు కూడా ఇప్పటికే లీకయ్యాయి. అయితే దీని ధర ఎంత ఉండనుందో మాత్రం లాంచ్ సమయంలోనే తెలిసే అవకాశం ఉంది.

ఈవెంట్ పేజీ ప్రకారం ఇందులో ఒకే ఒక్క యూఎస్‌బీ టైప్-ఏ పోర్టు ఉండనుంది. యూఎస్‌బీ టైప్-ఏ నుంచి టైప్-సీకి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. 67 వాట్ల పవర్‌తో ఇది డివైస్‌లను చార్జ్ చేయగలదు. పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌తో పాటు ఈ చార్జర్ అందిస్తున్నారు. అయితే మనదేశంలో మాత్రం దీన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిందే.

క్వాల్‌కాం క్విక్ చార్జ్ 3.0 ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు ఇన్‌బిల్ట్ సర్జ్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా ఈ చార్జర్ పొందడం విశేషం. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు సహా.. అన్ని యూఎస్‌బీ టైప్-సీ డివైస్‌లను ఇది సపోర్ట్ చేయనుంది.
వెనక 64 మెగాపిక్సెల్, ముందు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. కొత్త ఫోన్ వచ్చేస్తుంది!
అయితే దీనికి సంబంధించిన సేల్ ఎక్కడ జరుగుతుందో తెలియరాలేదు. జులై 12వ తేదీన ఈ చార్జర్ లాంచ్ కానుంది. ఆ సమయంలో దీని గురించి మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

షియోమీకి సంబంధించిన మిగతా అప్‌డేట్స్ చూస్తే.. ఎంఐ 11 అల్ట్రా సేల్ మనదేశంలో ఎట్టకేలకు ప్రారంభం అయింది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.69,999గా నిర్ణయించారు.

ఎంఐ 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఇందులో 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 10W రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఫోన్ వెనకవైపు 1.1 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఎంఐ 11 అల్ట్రా పనిచేయనుంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్2 సెన్సార్‌ను అందించడటం విశేషం. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ టెలి మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 234 గ్రాములుగా ఉంది.
ఇది కదా అసలైన స్మార్ట్ ఫోన్ అంటే.. సూపర్ మొబైల్ లాంచ్ చేసిన క్వాల్‌కాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నిశ్చితార్థం అయ్యాక అందంగా లేవన్న పెళ్లి కొడుకు.. చినికిచినికి.. దారుణం

Sat Jul 10 , 2021
నిశ్చితార్థం అయిపోయాక నువ్వు అందంగా లేవు.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పెళ్లి కొడుకు తెగేసి చెప్పడంతో యువతి మనస్థాపానికి గురైంది. ఆ వ్యవహారం చినికిచినికి చివరికి దారుణాలకు దారితీసింది.