ఎంఐ 11 లైట్ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. చూడటానికి అందంగా.. ధర ఎంత ఉండనుందంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ.. ఎంఐ 11 లైట్‌ను త్వరలో లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని కలర్ ఆప్షన్లను కంపెనీ టీజ్ చేసింది.

ప్రధానాంశాలు:జూన్ 22వ తేదీన లాంచ్మూడు కలర్ ఆప్షన్లతో రానున్నట్లు టీజ్ చేసిన షియోమీఎంఐ 11 లైట్ మనదేశంలో జూన్ 22వ తేదీన లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షియోమీ ఇండియా ట్వీటర్‌లో ఈ ఫోన్ కలర్ ఆప్షన్లను షేర్ చేసింది. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఎంఐ టీజ్ చేశారు. ఎంఐ 11 లైట్ 4జీ, 5జీ వేరియంట్లు ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే ప్రస్తుతానికి మనదేశంలో కేవలం 4జీ వేరియంట్ మాత్రమే లాంచ్ కానుందని తెలుస్తోంది.

జాజ్ బ్లూ, టస్కనీ కోరల్, వినైల్ బ్లాక్ రంగుల్లో ఎంఐ 11 లైట్ మనదేశంలో లాంచ్ కానుంది. ఈ వీడియోలో మూడు కలర్ ఆప్షన్లను చూడవచ్చు. వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఎంఐ 11 లైట్ యూరోపియన్ మార్కెట్లో బోబా బ్లాక్, బబుల్ గమ్ బ్లూ, పీచ్ పింక్ రంగుల్లో లాంచ్ అయింది.
కొత్త ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేయనున్న రియల్‌మీ.. అధికారిక ప్రకటన వచ్చేసింది!
ఎంఐ 11 లైట్ 4జీ ధర(అంచనా)
ఎంఐ 11 లైట్ 4జీ యూరోప్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. మనదేశంలో ఈ ఫోన్ రూ.25 వేలలోపు ధరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఎంఐ 11 లైట్ 4జీ స్పెసిఫికేషన్లు(యూరోపియన్ వేరియంట్)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఎంఐ 11 లైట్ పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4250 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని మందం 0.68 సెంటీమీటర్లు కాగా, బరువు 157 గ్రాములు మాత్రమే.
ఒప్పో రెనో 6జెడ్ స్పెసిఫికేషన్లు లీక్.. మిడ్‌రేంజ్‌లో సూపర్ ఫీచర్లతో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

MS Dhoni రికార్డ్ బ్రేక్.. విరాట్ కోహ్లీనే టాప్

Sat Jun 19 , 2021
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2014తో నెలకొల్పిన రికార్డ్‌ని తాజాగా విరాట్ కోహ్లీ కనుమరుగు చేశాడు. బ్యాటింగ్‌లో ఇప్పటికే అరుదైన ఘనతల్ని సాధించిన కోహ్లి..