హైదరాబాద్: కోట్ల విలువైన హెర్బల్ ప్రొడక్ట్స్ అంటూ మహిళ నుంచి 41 లక్షలు దోచేశాడు

ఫేస్‌బుక్‌లో పరిచయమైన విదేశీ వ్యక్తికి రూ.40 లక్షలకుపైగా సమర్పించుకుని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. చివరకు అతడిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు.

ప్రధానాంశాలు:ఫేస్‌బుక్ ద్వారా పరియమైన ఐవరీకోస్ట్ మోసగాడు.ఆయుర్వేద ఉత్పత్తులో పేరుతో లక్షల మోసం.మెహదీపట్నం మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు.ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో ఓ మహిళ నుంచి లక్షలు దోచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదుచేసి, అరెస్ట్ చేశారు. సరికొత్త తరహాలో హెర్బల్ ఉత్పత్తుల పేరుతో విదేశీయుడు మహిళను మోసం చేసి ఆమె దగ్గర నుంచి లక్షల్లో దోచుకున్నాడు. మెహదీపట్నంలోని బాధిత మహిళ శైలు కుమారికి ఐవెరీకోస్ట్‌కు చెందిన మెస్సీ ఢాంకో ఫ్రాంక్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తాను హెర్బల్ ప్రొడక్ట్స్ సరఫరా చేస్తామని ఆమెను నమ్మించాడు.

వీటికి హైదరాబాద్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని.. వ్యాపారంలో లాభాలు గడించవచ్చని చెప్పడంతో.. నిజమేని శైలకుమారి పూర్తిగా అతడిని నమ్మింది. తనకు ఆయుర్వేద ఉత్పత్తులను పంపాలని కోరింది. దీంతో రూ.5 కోట్ల విలువైన హెర్బల్ ప్రొడక్ట్స్ ఆమె కోసం సప్లై చేస్తామని నిందితుడు నమ్మ బలికాడు. ఇక్కడే తన ప్లాన్ అమలు చేశాడు. ప్రోడక్ట్స్ పంపాలంటే కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలని చెప్పాడు. కోట్ల విలువైన సరుకు పంపుతున్నామని.. లక్షల్లోనే అడ్వాన్స్ ఇవ్వాలని బుట్టలో వేశాడు.

మోసగాడి మాయలను పడిపోయిన ఆమె రూ. 41 లక్షలు తన అకౌంట్ నుంచి బదిలీచేసింది. లక్షలు ముట్టిజెప్పినా అతడి నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. అతడి చేతిలో మోసపోయినట్టు గ్రహించిన శైలు కుమారి.. పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐవరికోస్ట్‌కు చెందిన మెస్సి ఢాంకో ఫ్రాంక్ ఈ మోసానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. కోర్టు ముందు హాజరు పరచడంతో రిమాండ్ విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మీ పాలనలో రోడ్లకు ఎంతటి మహర్ధశ.. ఆ వైభవాన్ని కళ్లారా చూడండి: ఎంపీ రఘరామ సెటైర్లు

Fri Jul 16 , 2021
వర్షాకాలం సీజన్లో రోడ్ల పరిస్థితి అత్యంత హీనంగా ఉన్న కారణంగా రాష్ట్ర రహదారుల శాఖకు చెందిన ఓ అధికారి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం ప్రభుత్వ వైఫల్యానికి గుర్తుగా మిగిలిపోతుందని రఘురామ అన్నారు.