మేడారం మహా జాతర తేదీలు ఖరారు

మాఘ శుద్ధ పౌర్ణమి రోజు మేడారంలో మహాజాతరను నిర్వహిస్తుంటారు. ఆసియా ఖండంలోనే పెద్ద ఆదివాసీ జాతర అయిన మేడారంకు కోట్లలో భక్తులు హాజరవుతారు. వచ్చే ఏడాది జాతరకు నిర్వహించే తేదీలను పూజారులు ఖరారు చేశారు.

ప్రధానాంశాలు:మేడారం మహాజాతర తేదీలు ఖరారు ఫిబ్రవరి 16 నుంచి 19వరకు జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మహాజాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ఆదివాసి జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను 2022, ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గల ఆదివాసీ గిరిజన దైవాలు శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.

భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే. జాతర ముగిసేనాటికి వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 2 కోట్లకు పైగా జనాభా హాజరవుతారు అని అంచనా. వచ్చే సంవత్సరం నిర్వహించే జాతర తేదీలను పూజారులు నిర్ధారించారు. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్నట్లు ఆదివారం మేడారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూజారులు తెలిపారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.

ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవుల్లో ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. ఈ పండగను 2014లో రాష్ట్ర పండగుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మహా జాతరకు తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా ఒడిశా, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మరో సీనియర్ యాక్టర్ ప్రాణాలు బలిగొన్న కరోనా.. దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ

Sun Apr 25 , 2021
రెండో దశలో కరోనా మహమ్మారి కోరలు చాచుకొని విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు లలిత్ భేల్ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో సినీ పెద్దలు అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.