కొత్తగా కారు కొనే వారికి భారీ షాక్.. వచ్చే నెల నుంచి..

మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అది కూడా మారుతీ కారు అయితే బెటర్ అని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

ప్రధానాంశాలు:కారు కొనే వారికి ఝలక్మారుతీ కీలక ప్రకటనవారిపై ప్రభావంమీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యా్డ్ న్యూస్. దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో కరు కొనే వారిపై ప్రభావం పడనుంది.

రెగ్యులైటరీ ఫైలింగ్‌లో మారుతీ సుజుకీ ఈ విషయాన్ని వెల్లడించింది. జూలై నుంచి కార్ల ధరల పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం వల్ల కంపెనీపై తీవ్ర ప్రభావం పడుతోందని మారుతీ సుజుకీ తెలిపింది.

Also Read: గుడ్ న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధర.. పడిపోయిన వెండి.. ఈ రేట్లు ఇవే!

ఈ నేపథ్యంలో ధరల పెంపు అనివార్యం అయ్యిందని కంపెనీ తెలిపింది. వచ్చే నెల నుంచి కార్ల ధరల పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తామని వెల్లడించింది. ఎంపిక చేసిన కార్ల ధరలు మాత్రమే పెరుగుతాయని కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు కారు మోడల్ ప్రాతిపదికన మారుతుందని పేర్కొంది.

ఇకపోతే మారుతీ సుజుకీ జనవరిలో కూడా పలు కార్ల ధరలను పెంచింది. తర్వాత ఏప్రిల్ నెలలో కూడా కార్ల ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ పలు కార్ల ధరలు పెంచుతామని ప్రకటించింది. అంటే మారుతీ కారు కొనే వారిపై ప్రభావం పడనుందని చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అక్కినేని కోడలి న్యూ స్టెప్.. వినూత్నంగా ఆలోచించి ఆ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న సమంత!

Mon Jun 21 , 2021
ఇప్పటికే సాకీ ఫ్యాషన్ వరల్డ్, 'ఏకం' ప్రీ స్కూల్ స్థాపించిన సమంత.. మరో బిజినెస్‌పై ఫోకస్ పెట్టిందని సమాచారం. ఇందుకోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ చాలారోజుల క్రితమే స్టార్ట్ చేసిందట సామ్.