మారుతీ బంపరాఫర్.. ఏకంగా రూ.88 వేల డిస్కౌంట్!

మీరు కొత్తగా మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన అంబులెన్స్ వ్యాన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకు భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఏకంగా రూ.88 వేలు ఆదా చేసుకోవచ్చు.

ప్రధానాంశాలు:మారుతీ బంపరాఫర్భారీ తగ్గింపురూ.88 వేలు ఆదాదేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. తన అంబులెన్స్ వ్యాన్ల ధరను భారీగా తగ్గించేసింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ స్లాబ్స్‌ను మార్చడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలనే కోవిడ్ 19 సంబంధిత ఐటమ్స్‌పై జీఎస్‌టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతీ సుజుకీ కూడా అంబులెన్స్ వెర్షన్ ఈకో వ్యాన్లపై ధరను తగ్గించేసింది. వీటిపై జీఎస్‌టీ 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గడం ఇందుకు ప్రధాన కారణం.

Also Read: కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. రూ.9 వేల భారీ తగ్గింపు!

ధర తగ్గింప తర్వాత చూస్తే.. మారుతీ సుజుకీ ఈకో అంబులెన్స్ వ్యాన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.6.16 లక్షలుగా ఉంది. అయితే ఈ ఆఫర్ కొన్ని నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి. 2021 సెప్టెంబర్ 30 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఎవరైనా కస్టమర్లు ఈ మారుతీ సుజుకీ అంబులెన్స్ వ్యాన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. దగ్గరిలోని డీలర్ షిప్స్ వద్దకు వెళ్లి వ్యాన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇకపోతే కంపెనీ ఇందులో 1.2 లీటర్ ఇంజిన్ అమర్చింది. 5 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నిరుద్యోగుల కోసం పవన్ కళ్యాణ్: ఇదే సరైన టైమ్.. జనసైనికులు ఓ రేంజ్‌లో!

Mon Jun 21 , 2021
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదల చేసి జాబ్ కేలెండర్‌పై దుమారం రేగుతోంది. ఈ తరుణంలో జనసైనికులు గళం విప్పుతున్నారు.