రకుల్‌ను తెగ మిస్ అవుతోన్న మంచు లక్ష్మీ.. ఆ ఫోటోతో అసలు విషయం లీక్!

మంచు లక్ష్మీకి టాలీవుడ్‌లో ఎంత మంది స్నేహితులున్నారో అందరికీ తెలిసిందే. స్టార్ హీరో, హీరోయిన్లందరితోనూ మంచు లక్ష్మీకి మంచి సంబంధాలే ఉన్నాయి. అందుల్ రకుల్ ప్రీత్ వంటి వారింతో మరింత సన్నిహితంగా ఉంటారు.

ప్రధానాంశాలు:సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ రకుల్ ప్రీత్ఇద్దరి మధ్య స్నేహ బంధంమిస్ అవుతున్నానంటూ మంచు లక్ష్మీ పోస్ట్మంచు లక్ష్మీ వ్యవహారం ఏంటో ఓ పట్టాన ఎవ్వరికీ అర్థం కాదు. మొన్నటికి మొన్న కేటీఆర్ కరోనాతో బాధపడుతూ ఉంటే నా సినిమాలు చూడు అంటూ ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ మీద వచ్చినన్ని ట్రోల్స్ మరేతర పోస్ట్ మీద వచ్చి ఉండవు. అలా తన మీద వచ్చిన ట్రోలింగ్‌పై మంచు లక్ష్మీ కాస్త సీరియస్ అయ్యారు. షిట్ అంటూ అలాంటిది నేను పట్టించుకోనంటూ గట్టిగా కౌంటర్ వేశారు.

అయితే తాజాగా రకుల్ ప్రీత్ మీద మంచు లక్ష్మీ బెంగపెట్టేసుకున్నారు. ఈ మేరకు మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో మంచు లక్ష్మీ రకుల్ ప్రీత్ మధ్య ఉన్న చనువు, ఆ బంధం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకుంటారు. పండుగలకు ఒకే చోట ఉంటారు. మొన్నటి హోలికి ఈ ఇద్దరూ కలిసి ట్రెక్కింగ్, బోటింగ్ అంటూ నగర శివారు ప్రాంతాల్లో రచ్చ చేశారు.

అయితే ఇప్పుడు మాత్రం రకుల్ ప్రీత్ గురించి మంచు లక్ష్మీ తెగ ఆలోచిస్తోన్నట్టు కనిపిస్తోంది. మిస్ అవుతున్నా అంటూ రకుల్ గురించి మంచు లక్ష్మీ ఓ పోస్ట్ పెట్టేశారు మంచు లక్ష్మీ. తాను కూడా ఎంతో మిస్ అవుతున్నానంటూ మంచు లక్ష్మీ పోస్ట్‌కు రకుల్ ప్రీత్ రిప్లై ఇచ్చారు. ఇక మంచు లక్ష్మీ షేర్ చేసిన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే ఆ ఇద్దరూ కలిసి చేసిన ఫోటో షూట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
పెండింగ్‌‌లో ఆ పని.. చేయమంటారా? వద్దా?.. నేరుగా అడిగేసిన రష్మిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున.. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ త్వరలోనే

Sun Apr 25 , 2021
కింగ్ నాగార్జున అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమాని త్వరలోనే తెరకెక్కిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కోవిడ్ ఉపద్రవం కాస్త సద్దుమణిగిన తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటిస్తామని.. ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.