చీరతో మంచు లక్ష్మి మాస్ డాన్స్.. ఒంపు సొంపుల వయ్యారాలు వడ్డిస్తూ నాభి సోయగాలు.. ట్రోల్స్ ఓ రేంజ్‌లో

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యమా యాక్టివ్.. ఆమె ఏదైనా పోస్ట్ పెట్టిందంటే ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఇక ట్రోలింగ్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నా.. మంచు డాటర్ మాత్రం వెనక్కి తగ్గదు. తన పని తాను చేసుకుపోతుంటుంది.

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అయితే.. సోషల్ మీడియా క్వీన్ మంచు లక్ష్మి. తనకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే మంచులక్ష్మి తాజాగా చీరకట్టులో కనువిందు చేసింది.

అంతేకాదు చీరకట్టులో మాస్ డాన్స్ వేస్తూ ఉర్రూతలూగించింది. ‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ ఆ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో ఆమె కూతురు విద్యా నిర్వాణ కూడా తల్లితో జతకలిసి మాస్ స్టెప్పులు వేశారు.

అయితే ఈ వీడియోలో మంచు లక్ష్మి చీరకట్టులోనే ఉంది అసలు అందం అనేట్టుగా.. ఒంపుసొంపుల వయ్యారాలను వడ్డించారు. నాభి అందాలతో కనువిందు చేయడంతో ఆమె ఫాలోవర్స్ కామెంట్ల మోత మోగిస్తున్నారు. కొంతమంది ఆహా ఓహో అని అంటుంటే.. మరికొంతమంది మాత్రం ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్లతో ట్రోల్స్ మొదలుపెట్టారు.

రికార్డింగ్ డాన్స్ అని కొందరు.. ఆమె అంద చందాలను తెగ వర్ణిస్తున్నారు. అయితే ఆమె నాభికి రింగ్ ఉండటాన్ని పసిగట్టి మరీ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్‌కి అయితే ఈ వీడియో తెగ నచ్చేయడంతో లైక్స్ కొట్టింది. ఆమెతో మరికొంతమంది మంచు లక్ష్మి మాస్ డాన్స్‌‌కి ఫిదా అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Thalapathy 65 First Look : BEAST అంటూ దుమ్ములేపిన దళపతి

Mon Jun 21 , 2021
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. విజయ్ బర్త్ డే (జూన్ 21) సందర్భంగా వదిలిన కొత్త సినిమా అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులు ఈ మేరకు వార్తలు రాసాగాయి.