సెలబ్రిటీలకు షాక్ ఇచ్చిన ‘మాల్దీవ్స్’ సర్కార్.. ఇప్పుడేం చేస్తారంటూ నెటిజన్ల సెటైర్లు

ఖాళీ సమయం దొరికిందంటే చాలు మాల్దీవులకు విహార యాత్రలకు వెళ్తుంటారు మన సెలబ్రిటీలు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఇది కామన్ అయిపోయింది. అయితే ఇలా మాల్దీవులకు విహారయాత్రలకు వెళ్లాలనుకొనే ప్రతీ ఒక్కరికి అక్కడి సర్కారు ఊహించని షాక్ ఇచ్చింది.

కరోనా వైరస్ గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇక రెండో దశలో భారత్‌లో కరోనా మరింత శక్తివంతంగా మారి విలయతాండవం చేస్తోంది. గత ఏడాదిలా లాక్‌డౌన్ నిబంధనలు ఏమీ లేకపోవడం.. తదితర కారణాల వల్ల వైరస్ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వాలు నైట్ కర్వ్యూ.. వారాంతపు లాక్‌డౌన్‌లు విధించాయి. దీంతో ఇప్పటికే సినిమా షూటింగ్‌లు రద్దు అయ్యాయి.

కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు మరోసారి నిలిచిపోయాయి. షూటింగ్‌లు లేకపోవడంతో సెలబ్రిటీలు విహారయాత్రల బాటపట్టారు. బాలీవుడ్ ప్రేమ పక్షులు ఆలియా భట్, రణ్‌బీర్ సింగ్, దిశాపటానీ, టైగర్ ష్రాఫ్‌లో పాటు జాన్వీ కపూర్, శ్రద్ధా దాస్ తదితరులు మాల్దీవులకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేశారు. అంతేకాక.. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై విమర్శల వర్షం కురిస్తోంది. ‘ఓవైపు దేశం కరోనా కేసులతో అతలాకుతలం అవుతుంటే మీకు షికార్లు కావాల్సి వచ్చాయా..’ అంటూ వాళ్లు మండిపడ్డారు.

అయితే ఇప్పుడు మాల్దీవుల సర్కారు ఈ సెలబ్రిటీలకు షాక్‌ ఇచ్చింది. భారత్‌లో లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో.. పలు దేశాలు భారత్‌ నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. తాజగా మాల్దీవులు కూడా భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.

దీంతో మరోసారి సెలబ్రిటీలపై నెటిజన్లు సెటైర్లు వేయడం ప్రారంభించారు. ‘ఇంతకాలం బాగా ఎంజాయ్ చేశారుగా.. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు.. ఏ ఫొటోలు పోస్ట్ చేస్తారు’.. ‘అయ్యో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారేమో.. ఇప్పుడు ఎలా’ అంటూ నెటిజన్లు సెలబ్రిటీలను ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు కొన్ని ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న మీమ్స్‌లో వీళ్లని ట్యాగ్ చేస్తూ.. ఆడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వైకల్యాన్ని జయించిన వీరుడు ఆయన.. ఆ వార్త ఎంతో బాధ మిగిల్చింది: జీవిత రాజశేఖర్

Mon Apr 26 , 2021
టాలీవుడ్ నటుడు పొట్టి వీరయ్య పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన జీవిత రాజశేఖర్ దంపతులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.