నటి రేవతి సంచలన పోస్ట్.. మొత్తం 14 మంది లైంగికంగా.. హీరో నుంచి పోలీస్, డాక్టర్ వరకూ లిస్ట్ ఇదే

తనని శారీరకంగా మానసికంగా వేధించిన వ్యక్తుల లిస్ట్‌ని పేర్లు,ఫొటోలతో సహా బయటపెట్టి మలయాళ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది సంచలన నటి రేవతి సంపత్. ఈ మేరకు తీవ్ర ఆరోపణలు చేసింది రేవతి.

టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ వేళ్లూనుకుంది. అవకాశాల పేరుతో అమ్మాయిల పడక సుఖం కోరుకునే కామాంధులు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నారు. తెరవెనుక బాగోతాలు ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉన్నా.. అప్పుడప్పుడూ బయటపడుతుంటాయి. ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, డాన్సర్లు ఇలా చాలామంది గొంతు విప్పి రసికరాజుల బండారాన్ని బయటపెట్టగా.. తాజాగా మలయాళ నటి, సోషల్ యాక్టివిస్ట్ రేవతి తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని బయటపెట్టింది.
View this post on Instagram A post shared by Revathy Sampath (@revathy_sampath)
తనని శారీరకంగా, మానసికంగా, అసభ్య పదజాలంతో వేధించిన 14 మంది పేర్లను ఫొటోలతో సహా ఫేస్‌బుక్‌ వేదికగా బయటపెట్టింది. ‘ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను ఓ అడుగు కూడా వెనక్కి వేయను’ అని రేవతి కామెంట్స్ చేస్తూ వాళ్ల బండారాన్ని బయటపెట్టింది. ఈ లిస్ట్‌లో పాపులర్‌ ఆర్టిస్ట్‌ సిద్ధిక్‌, దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌, ఓ డాక్టర్‌, సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ కూడా ఉన్నారని వెల్లడించింది.
View this post on Instagram A post shared by Revathy Sampath (@revathy_sampath)

రేవతి సంపత్‌పై వేధింపులకు పాల్పడిన ప్రముఖుల పేర్లు వివరాల లిస్ట్ ఇదే..
1. రాజేశ్‌ టచ్‌రివర్‌ (డైరెక్టర్)
2. సిద్ధిక్‌ (నటుడు)
3. ఆషికి మహి(ఫొటోగ్రాఫర్‌)
4. సిజ్జు (నటుడు)
5. అభిల్‌ దేవ్‌ (కేరళ ఫ్యాషన్‌ లీగ్‌ ఫౌండర్‌)
6. అజయ్‌ ప్రభాకర్‌ (డాక్టర్‌)
7. ఎంఎస్‌ పదూష్‌
8. సౌరబ్‌ కృష్ణన్‌
9. నందు అశోకన్‌ (డివైఎఫ్‌ఐ కమిటీ మెంబర్‌)
10. మాక్స్‌వెల్‌ జోస్‌ (షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌)
11. షానుబ్‌ కరావత్‌ (యాడ్‌ డైరెక్టర్‌ )
12. రాగేంద్‌ పై (క్యాస్టింగ్‌ డైరెక్టర్‌)
13. సరున్‌ లియో (ఈఎస్‌ఎఎఫ్‌ బ్యాంక్‌ ఏజెంట్‌)
14. బిను (పొన్‌తూరా పోలీస్ స్టేషన్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌, తిరువనంతపురం)
View this post on Instagram A post shared by Revathy Sampath (@revathy_sampath)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Nandigram Election విచారణ నుంచి ఆ జడ్జిని తప్పించండి: హైకోర్టుకు మమతా సంచలన లేఖ

Sat Jun 19 , 2021
Suvendu Adhikari నందిగ్రామ్ ఎన్నికను కొట్టేయాలని మమతా బెనర్జీ తరఫున న్యాయవాది సంజయ్ బోస్ కోరారు. మూడు రోజుల కిందటే ఈ పిటిషన్ దాఖలు కాగా.. శుక్రవారం విచారణకు వచ్చింది.