ఈ నెంబర్‌కు కాల్ చేస్తే 2 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్!

గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. కేవలం 2 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ తీసుకోవచ్చ. అయితే ఇది కేవలం 5 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌కు మాత్రమే వర్తిస్తుంది.

ప్రధానాంశాలు:గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అలర్ట్వేగంగానే ఎల్‌పీజీ సిలిండర్రూ.25 చార్జీ చెల్లిస్తే చాలుమీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. గ్యాస్ సిలిండర్‌ను కేవలం 2 గంటల్లోనే ఇంటికి డెలివరీ పొందొచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. కేవలం ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.

అయితే ఇది 5 కేజీల గ్యాస్ సిలిండర్‌కు వర్తిస్తుంది. అంటే మీరు 5 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ను కేవలం 2 గంటల్లోనే హోమ్ డెలివరీ పొందొచ్చు. ఇంట్లో సిలిండర్ అయిపోయినప్పుడు ఈ సేవల వల్ల ఊరట పొందొచ్చు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడానికి రూ.25 చార్జీ తీసుకుంటారు.

Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. కొనేందుకు మంచి ఛాన్స్?

Also Read: రూ.లక్షా 70 వేలు పెడితే చాలు ఈ మారుతీ కారు మీ సొంతం!

మీరు 1800 22 4344 నెంబర్‌కు కాల్ చేసి సిలిండర్ హోమ్ డెలివరీ పొందొచ్చు. అయితే ఇది కేవలం భారత్ గ్యాస్ వినియోగదారులకే వర్తిస్తుంది. హైదరాబాద్‌లో హోమ్ డెలివరీ సేవలు లభిస్తున్నాయి. ఇకపోతే 5 కేజీల గ్యాస్ సిలిండర్లు ఇండేన్ గ్యాస్ వాడే వారు కూడా పొందొచ్చు.

ఈ 5 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పొందటానికి ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అక్కర్లేదు. కేవలం ఐడీ ప్రూఫ్ చెల్లిస్తే సరిపోతుంది. హోమ్ డెలివరీ పొందలేని వారు దగ్గరిలోని కిరాణ స్టోర్లు, సూపర్ మార్కెట్ల వద్దకు వెళ్లి ఐడీ ప్రూఫ్ చూపించి డబ్బులు చెల్లించి 5 కేజీల సిలిండర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మేడారం మహా జాతర తేదీలు ఖరారు

Sun Apr 25 , 2021
మాఘ శుద్ధ పౌర్ణమి రోజు మేడారంలో మహాజాతరను నిర్వహిస్తుంటారు. ఆసియా ఖండంలోనే పెద్ద ఆదివాసీ జాతర అయిన మేడారంకు కోట్లలో భక్తులు హాజరవుతారు. వచ్చే ఏడాది జాతరకు నిర్వహించే తేదీలను పూజారులు ఖరారు చేశారు.