వైసీపీకి బిగ్ షాక్? తేల్చిచెప్పిన లోక్‌సభ స్పీకర్.. రఘురామ సేఫ్.!

రఘు రామకృష్ణ రాజుపై తక్షణం అనర్హత వేటు వేయాలని వైసీపీ తీవ్ర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. రఘురామ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ సర్కార్‌కి కంటిలోన నలుసు.. చెవులోని జోరీగలా తయారైన సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పార్లమెంటరీ లీడర్లు పలుమార్లు లోక్‌సభ స్పీకర్‌ని కలిసి వినతులు, చర్చలు చేసినా ఫలితం లేకపోయింది. రఘురామపై వేటు వేసే విషయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఎంపీ రఘురామ అనర్హత వేటుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రతిష్టను మంటగలుపుతున్నారని.. తక్షణమే అనర్హత వేటు వేయాలని చేసిన ఫిర్యాదులను స్పీకర్ బిర్లా తోసిపుచ్చారు. రఘురామపై అనర్హత వేటు విషయంలో ఇరువర్గాల వాదనలను వినాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే అనర్హతపై నిర్ణయం ఉంటుందని తేల్చిచెప్పారు. దీంతో రఘురామ సేఫ్ అనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇప్పటికే రఘురామ వ్యవహారంలో సీరియస్‌గా ఉన్న వైసీపీ అధిష్టానం ఎలాగైనా ఆయన్ను పదవి నుంచి తప్పించాలనే పట్టుదలతో ఉంది. అనర్హత వేటు వేయించాలని పావులు కదిపింది. అందులో భాగంగానే వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్‌ ఇటీవల మరోమారు స్పీకర్‌ని కలిశారు. వీలైనంత త్వరగా రఘురామను డిస్‌క్వాలిఫై చేయాలని.. ఆలస్యం చేయొద్దని కోరారు. స్పీకర్ నుంచి సానుకూల స్పందన రాలేదేమో.. మరుసటి రోజు విజయసాయి షాకింగ్ కామెంట్స్ చేశారు.

స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీయూ ఎంపీ శరద్ యాదవ్‌పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వెంటనే చర్యలు తీసుకున్నారని.. అలా స్పీకర్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రఘురామపై అనర్హత వేటు వేయకుంటే లోక్‌సభ సమావేశాలను స్తంభింపచేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దుమారం కూడా రేగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా రఘురామపై అనర్హత వేటు ఇప్పట్లో లేదని పరోక్షంగా తేల్చి చెప్పడంతో వైసీపీ భంగపాటు తప్పలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: దేవెగౌడకు కోపం.. అందుకే నోర్మూసుకున్న బాబు.. వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నథింగ్ ఇయర్ 1 ధర ఇదే.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లు!

Mon Jul 12 , 2021
వన్‌ప్లస్ సహవ్యవస్థాపకుడు కార్ల్‌పెయ్ నథింగ్ అనే కొత్త సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ పేరుతో మొట్టమొదటిసారి ఇయర్‌బడ్స్ లాంచ్ కానున్నాయి. నథింగ్ ఇయర్ 1 అనే పేరుతో రానున్న వీటి ధరను అధికారికంగా ప్రకటించారు.