LIC అదిరే పాలసీ.. రూ.230 పొదుపుతో చేతికి రూ.17 లక్షలు!

ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు పలు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఎల్‌ఐసీ పాలసీల్లో జీవన్ లాభ్ కూడా ఒకటుంది. ఈ పాలసీతో రెండు ప్రయోజనాలు పొందొచ్చు.

ప్రధానాంశాలు:అదిరే పాలసీరెండు ప్రయోజనాలుప్రొటెక్షన్, ప్రాఫిట్దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో రకాల పాలసీ స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. లోన్ తీసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. అలాగే కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.

మీరు ఎంచుకునే పాలసీ ఆధారంగా మీకు లభించే బెనిఫిట్స్ కూడా మారుతూ ఉంటాయని గమనించాలి. ఎల్‌ఐసీ అందించే స్కీమ్స్‌లో జీవన్ లాభ్ కూడా ఒకటి. దీని వల్ల ప్రాఫిట్, ప్రొటెక్షన్ రెండూ లభిస్తాయి. 8 నుంచి 59 ఏళ్ల వరకు వయసులో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది.

Also Read: కొత్తగా బైక్, స్కూటర్ కొనే వారికి భారీ షాక్.. పండుగ సీజన్ ముందు..

కనీసం రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీకు నచ్చిన బీమా మొత్తానికి పాలసీ పొందొచ్చు. మూడేళ్ల తర్వాత లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. చెల్లించిన ప్రీమియం మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు.

పాలసీదారుడు జీవించి ఉంటే.. పాలసీ డబ్బులు, బోనస్ వంటివి మెచ్యూరిటీ తర్వాత అందిస్తారు. ఒకవేళ మరణిస్తే.. నామినీ లేదా కుటుంబ సభ్యులకు పాలసీ డబ్బులు చెల్లిస్తారు. 20 ఏళ్ల వయసులో ఉన్న వారు 16 ఏళ్ల టర్మ్‌తో రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే.. నెలకు రూ.7 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అంటే రోజుకు రూ.230 ఆదా చేస్తే సరిపోతుంది. పదేళ్లు ప్రీమియం కట్టాలి. మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.17 లక్షలకు పైగా వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Bank అదిరిపోయే ఆఫర్.. రూ.10 వేల క్యాష్‌బ్యాక్!

Mon Sep 20 , 2021
బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ.10 వేలు ఆదా చేసుకోవచ్చు. ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది.