లెనోవో కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లెనోవో కొత్త ల్యాప్‌టాప్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ప్రో. దీని ధర రూ.77,990గా ఉంది.

ప్రధానాంశాలు:లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ప్రో వచ్చేసిందిధర రూ.77,990 నుంచి ప్రారంభంలెనోనో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ప్రో ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. లెనోవో ఐడియాప్యాడ్ సిరీస్‌లో ఇది లేటెస్ట్ ల్యాప్‌టాప్. ఇందులో 2.2కే ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ అట్మాస్ ఆడియో టెక్నాలజీ, జీరో టచ్ లాగిన్, డ్యూయల్ అరే మైక్రోఫోన్లు కూడా ఇందులో ఉన్నాయి.

లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ప్రో ధర
ఈ ల్యాప్‌టాప్ ధరను రూ.77,990గా నిర్ణయించారు. స్టార్మ్ గ్రే రంగులో దీన్ని కొనుగోలు చేయవచ్చు. లెనోవో.కాం, ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది.
రూ.13 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్.. రెడ్‌మీ 10 ప్రైమ్ వచ్చేసింది!
లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ప్రో స్పెసిఫికేషన్లు
ఈ ల్యాప్‌టాప్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. దీన్ని విండోస్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 14 అంగుళాల 2.2కే, 16 అంగుళాల డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ ఐపీఎస్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే వెర్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఏఎండీ రైజెన్ 7, ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్ వేరియంట్లు కూడా ఇందులో ఉన్నాయి.

వీడి డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. 16 జీబీ డీడీఆర్4 ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ కూడా ఇందులో అందించారు. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ, ఏఎండీ రేడియోన్, ఎన్‌వీడియా జీఫోర్స్ గ్రాఫిక్స్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. వైఫై 6, బ్లూటూత్ వీ5.1, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ ఫీచర్లు కూడా ఇందులో లెనోవో అందించింది.

14 అంగుళాల వేరియంట్‌లో 56.5Whr, 16 అంగుళాల వేరియంట్లో 75Whr బ్యాటరీని అందించారు. 14 అంగుళాల మోడల్ బరువు 1.4 కేజీలు కాగా, 16 అంగుళాల వేరియంట్ ధర 1.9 కేజీలుగా ఉంది.
అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 12.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Pramod Bhagatకి పారాలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్.. భారత్‌కి 17వ పతకం

Sat Sep 4 , 2021
పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌లో ప్రమోద్ భగత్ ఈరోజు పసిడి పతకాన్ని గెలుపొందగా.. అదే విభాగంలో మనోజ్ సర్కార్ కాంస్యం గెలిచాడు.