దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌కి డబుల్ ధమాకా.. ట్విన్ సన్స్

ట్రాక్‌పై చిరుతని తలపించే పరుగుతో అందర్నీ ఆశ్చర్యపరిచిన ఉసేన్ బోల్ట్ రెండోసారి తండ్రయ్యాడు. ఈసారి అతని భార్య ట్విన్స్‌కి జన్మనిచ్చింది. వారి పేర్లు ఏమంటే…

ప్రధానాంశాలు:ట్విన్స్‌కి జన్మనిచ్చిన ఉసేన్ బోల్ట్ భార్యఇప్పటికే అతనికి ఒలింపియాన్ అనే పాప100మీ, 200మీ పరుగులో బోల్ట్ అరుదైన రికార్డ్‌లు2017లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌కి ఉసేన్ బోల్ట్ రిటైర్మెంట్ జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్‌ మళ్లీ తండ్రయ్యాడు. గత ఏడాది మే నెలలో ఒక పాపకి జన్మనిచ్చిన అతని భార్య కాశీ బెనెట్‌ తాజాగా ఇద్దరు మగపిల్లలకి జన్మనిచ్చింది. ఈ మేరకు అభిమానులతో ఈ గుడ్‌న్యూస్‌ని పంచుకున్న ఉసేన్ బోల్ట్.. ఆ ట్విన్స్‌కి థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని పేర్లు పెట్టినట్లు వెల్లడించాడు. 2020, మే నెలలో పుట్టిన పాపకి ఒలింపియా లైటింగ్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

View this post on Instagram A post shared by Usain St.Leo Bolt (@usainbolt)
ట్రాక్‌పై ఫాస్టెస్ట్ మ్యాన్‌గా ఘనత సాధించిన ఉసేన్ బోల్ట్.. 100మీ, 200మీ పరుగులో తిరుగులేని రికార్డులు నెలకొల్పాడు. మరీ ముఖ్యంగా.. 100మీ పరుగులో మూడు ఒలింపిక్స్‌ టైటిల్ గెలిచిన ఉసేన్ బోల్ట్.. తన కెరీర్‌లో మొత్తం 23 గోల్డ్ మెడల్స్ సాధించాడు. అయితే.. 2017లో రిటైర్మెంట్ ప్రకటించిన ఉసేన్ బోల్ట్.. 2019 వరకు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ టోర్నీల్లో ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఫుట్‌బాల్ టోర్నీల్లో అతను రాణించలేక.. క్రీడా రంగానికి 2019లో గుడ్ బై చెప్పేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AP New Governorగా యడియూరప్ప.. అసమ్మతి నేతల ఎత్తుగడేనా!

Mon Jun 21 , 2021
Karnataka BJP Rebels ఎలాగైనా సీఎంను మార్చాలని అసమ్మతి వర్గం పట్టుబడుతుంటే.. యడియూరప్ప మాత్రం తానే పూర్తికాలం కొనసాగుతానని ప్రకటించారు.