చంద్రబాబుకు షాక్… టీటీడీపీ అధ్యక్షుడు రమణ రాజీనామా

గురువారం ఎల్ రమణ కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో వారు ఎమ్మెల్యే టికెట్‌, పార్టీలో కీలక పదవుల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. కేసీఆర్ హామీతోనే రమణ టీడీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం.

ప్రధానాంశాలు:మూడు వ్యాఖ్యలతో రాజీనామా లేఖచంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎల్. రమణరాష్ట్ర ప్రగతి కోసమే టీఆర్ఎస్‌లోకితెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయ్యింది. తాజాగా అధ్యక్షుడు ఎల్‌ రమణ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే రమణ తన రాజీనామా లేఖను మూడే మూడు వ్యాఖ్యలతో ముగించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నెల రోజులుగా టీఆర్ఎస్ పార్టీ ఎల్. రమణతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి చొరవ తీసుకొని సీఎంతో భేటీకి నిర్ణయించారు. ఆయన నుంచి పిలుపురావడంతో రమణ గురువారం ఎర్రబెల్లి ఇంటికి వచ్చారు. ఎమ్మెల్యే టికెట్‌, పార్టీలో కీలక పదవుల గురించి మాట్లాడినట్లు తెలిసింది. తర్వాత ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, విపక్షాల పరిస్థితి, చేనేత సంక్షేమ కార్యక్రమాలు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల గురించి చర్చించారు. టీఆర్ఎస్ చేరి బీసీల అభ్యున్నతిలో భాగస్వామి కావాలని కేసీఆర్‌ సూచించారు.అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక బరి కోసం ఎల్ రమణను రంగంలోకి దించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ 30 వేలకు పైగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గం ఓట్లను రాబట్టేందుకు ఆయనను రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధి బృందం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వివో కొత్త ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Fri Jul 9 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వై53ఎస్‌ను లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతానికి వియత్నాంలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.