అలా చేయండి.. మనం ఫేస్‌ టూ ఫేస్ మాట్లాడుకుందాం.. ఫ్యాన్స్ కృతి కర్బందా ఆఫర్

‘తీన్‌మార్’, ‘కందిరీగ’, ‘బ్రూస్‌లీ’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి కృతి కర్బందా.. తెలుగులో మంచి సక్సెస్ దక్కకపోవడంతో బాలీవుడ్ బాటపట్టింది ఈ భామ. ఈ మధ్యే ఆమె నటించిన ‘14 ఫేరే’ అనే సినిమా ట్రైలర్ విడుదల అయింది.. దానిపై ఆమె వినూత్నంగా ప్రమోషన్ ప్రారంభించింది.

సినిమాలను ప్రమోట్ చేయడంలో ఒకొక్కరు ఒక్కో విధానాన్ని పాటిస్తారు. కొందరు ప్రతీ టీవీ ఛానెల్స్‌లో ఇంటర్య్వూ ఇస్తుంటారు. ఇంకొందరు రకరకాల వీడియోస్ చేస్తూ.. వాటితో సినిమాపై హైప్ పెంచుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం సోషల్‌మీడియా ద్వారానే సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ సినిమాల ప్రమోషన్‌ కూడా ఈ సోషల్‌మీడియానే ఎక్కువ వాడుతున్నారు. ప్రమోషన్ల కోసం.. ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకూ ఇక్కడ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.

తాజాగా హీరోయిన్ కృతి కర్బందా కూడా సోషల్‌మీడియా ద్వారానే అభిమానులను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. తెలుగులో ‘కందిరీగ’, ‘తీన్‌మార్’, ‘బ్రూస్‌లీ’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఆమె. అయితే తెలుగులో ఊహించినంత సక్సెస్ లభించకపోవడంతో.. బాలీవుడ్‌కి మకాం మార్చేసింది కృతి. అక్కడ ఈ భామకు మంచి సినిమాలే పడ్డాయి. స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం ఆమె ‘14 ఫేరే’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధిచిన ట్రైలర్ ఈ మధ్యే విడుదలై విశేషంగా అలరిస్తోంది.

దేవాన్షుసింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే హీరోగా నటించారు. దీనిపై కృతి కాస్త వినూత్నంగా ప్రమోట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వీడియోని ఆమె షేర్ చేశారు. తన సినిమా ట్రైలర్ అందరికి నచ్చిందంటూ ఆశాభావం వ్యక్తం చేసిన ఆమె.. అందరూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కాకుండా.. తన అభిమానులు ఎంతో ప్రత్యేకం అని పేర్కొన్న ఆమె ట్రైలర్‌లో తమకు నచ్చిన అంశం ఏంటో తెలపాలని స్పష్టం చేసింది. ఒకవేళ తనకు నచ్చిన అంశమే.. ఏ ఫ్యాన్‌కైనా నచ్చినట్లైతే.. వారితో కలిసి జూమ్‌లో ఫేస్‌ టూ ఫేస్ మాట్లాడుతాను అని ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.599 విలువైన ఇయర్‌ఫోన్స్ రూ.99కే.. ఎంఐ సూపర్ ఆఫర్!

Tue Jul 13 , 2021
షియోమీ తన వార్షిక సేల్‌లో భారీ ఆఫర్‌ను అందించింది. ఈ ఆఫర్ కింద రూ.599 విలువైన ఎంఐ ఇయర్‌ఫోన్స్ బేసిక్‌ను రూ.99కే కొనుగోలు చేయవచ్చు. జులై 16వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.